ముద్రగడ కొద్దిగా నీళ్లు తాగారు, అలాగైతే ముప్పే: వైద్యులు
రాజమండ్రి: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శనివారం ర్రాతి కొద్దిగా మంచినీళ్లు తీసుకున్నారని రాజ మహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. ఆహారం తీసుకోకపోవడం వల్ల ముద్రగడ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందని వారు తెలిపారు.
వైద్య పరీక్షలు చేయించుకోవాలని బంధు వులతో విజ్ఞప్తి చేయించినా ముద్రగడ వైద్య పరీక్షలకు నిరాకరించినట్లు వారు తెలియజేశారు. పరీక్షలు చేయించుకుంటేనే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పగలమని వైద్యులు అంటున్నారు. కాపులకు రిజ ర్వేషన్లు కల్పించాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ మళ్లీ దీక్ష చేపట్టిన సంగతి విదితమే.

అయితే, ఆయన దీక్షను గురువారం పోలీసులు భగ్నం చేసి ఆసుపత్రికి తరలించినా ముద్రగడ తన దీక్షను అక్కడే కొనసాగిస్తున్నారు. ఇదిలావుంటే, దీక్ష విరమించడానికి ముద్రగడ అంగీకరిస్తే తుని విధ్వంసం కేసును సిబిఐకి అప్పగిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే, అందుకు ముద్రగడ అంగీకరించలేదు.
అయోమయం: ముద్రగడపై ప్రభుత్వ ఎత్తుగడ ఏమిటి?
కాపుల సంక్షేమం కోసం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మీడియాతో చెప్పారు. తుని ఘటనలో విచారణ అనంతరమే అరెస్టులు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. శాంతి భద్రతలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పారు.
ముద్రగడకు ఫ్లూయిడ్స్ ఎక్కించే యత్నం: వైసిపి నేతల అరెస్టు
జగన్, చిరంజీవి కోరినట్లు ఈ ఘటనపై విచారణను సిబిఐకి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి వెల్లడించారు. ఎంత ఖర్చైనా ముద్రగడకు చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చినరాజప్ప తెలిపారు. దీక్ష విరమించాలని ముద్రగడను అధికారులు కోరారని ఆయన చెప్పారు. తుని ఘటనలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ముద్రగడ కోరారని, కాని అది వీలు కాదని చినరాజప్ప స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
