వైజాగ్ బీచ్ రోడ్డులో చక్రికి ఘన నివాళి (ఫోటోలు)
విశాఖపట్నం: విశాఖపట్నంలోని చక్రి అభిమానులు మంగళవారం సాయంత్రం బీచ్ రోడ్డులో గల ఘంటసాల విగ్రహం వద్ద చక్రి సంతాపం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉందిలే మంచి కాలం ముందుముందునా చిత్రం హీరో కార్తీక్, చక్రి తన ఆఖరి లైవ్ ప్రోగ్రామ్ అయినా ఝమ్మందినాదం కార్యక్రమంలో మ్యూజీషియన్ మిలినియమ్ శేఖర్ చక్రి చిత్రపాటనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చక్రితో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. జనవరి 11న జగమంత కుటుంబం నాది పేరిట సంగీత విభావరి నిర్వహించి నివాళులర్పించాలని వి టీమ్ బృందం వీరు మా వైజాగ్, వైజాగ్ సంగీత కళాకారులు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సంగీత ప్రియులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నిద్రలోనే...

అనతి కాలంలోనే అగ్రశ్రేణి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిన చక్రికి వృత్తి పట్ల అంకిత భావం ఎక్కువ. ఎప్పుడు చూసినా తన పనుల్లో బిజీగానే ఉండేవారు. చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఆదివారం అర్ధరాత్రి దాకా ఆయన రికార్డింగ్ థియేటర్ లోనే గడిపారు. అర్ధరాత్రి దాటాక పని ముగించుకుని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఇంటికి తిరిగొచ్చి నిద్రపోయారు. నిద్రలోనే గుండెపోటుకు గురయ్యారు.

చక్రి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి, నటుడు నందమూరి హరికృష్ణ, నిర్మాత రామా నాయుడు తదితరులు సంతాపం వ్యక్తం చేసారు. చక్రి మరణ వార్తను నమ్మలేకపోయానని చిరంజీవి అన్నారు. చక్రి చాలా మంచి వ్యక్తి అని, అలాంటివారు దూరం కావడం బాధాకరమని నిర్మాత రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. చక్రి కుటుంబ సభ్యులకు రామానాయుడు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విజయం తెలిసిన వెంటనే బాలయ్య చక్రి ఇంటికి చేరుకుని నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications