రాయలసీమ కేంద్రంగా భారీ స్కెచ్.. జగన్‌ను ఇరుకునపెట్టేలా పావులు కదుపుతోన్న మాజీలు.. వినకుంటే విపరీతమే.

రాజధాని మార్పు విషయంలో సీఎం జగన్ ను ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్ష పార్టీల ప్రయత్నాలకుతోడు మాజీ నేతలు కూడా రంగంలోకి దిగారు. 'సేవ్ అమరావతి' ఉద్యమంలో స్పీడు పెంచిన టీడీపీ.. ఇతర జిల్లాల్లోనూ ఆందోళనలకు ప్లాన్ చేస్తోంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ప్రభుత్వానికి ప్రశ్నలమీద ప్రశ్నలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా చేతనైన రీతిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి మైసూరా రెడ్డి నాయకత్వంలో పలు పార్టీలకు చెందిన మాజీ నేతలు గ్రేటర్ రాయలసీమ కేంద్రంగా భారీ ఉద్యమానికి ప్లాన్ సిద్ధం చేశారు.

లేఖలో సంచలన విషయాలు

లేఖలో సంచలన విషయాలు

రాయలసీమ జిల్లాలను తమిళనాడు లేదా కర్నాటకలో కలపాలంటూ కొందరు నాయకులు ఆవేశంలో మాట్లాడారేతప్ప, తమ డిమాండ్ ‘‘గ్రేటర్ రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలి'' అని మాజీ నేతలు ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తెలుగు ప్రజల కోసం సీమవాసులు చేసిన త్యాగాలను కూడా లేఖలో ప్రముఖంగా ప్రస్తావించారు.

హైపర్ కమిటీ సభ్యులు వీరే

హైపర్ కమిటీ సభ్యులు వీరే

రాజధానిపై ఏర్పాటైన హైపవర్ కమిటీకి పంపిన ఈ లేఖపై సంతకాలు చేసినవారిలో మాజీ ఎంపీ ఎంవీ మైసూరారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శైలజానాథ్, మాజీ డీజీపీలు దినేష్ రెడ్డి, ఆంజనేయరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చెంగారెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, మధుసూదన్ గుప్తా, శివరామకృష్ణారావు తదితర నేతలు జగన్ సర్కారుకు రాసిన లేఖ ప్రభుత్వానికి లేఖరాశారు. , మాజీ డీజీపీలు ఆంజనేయ రెడ్డి, దినేష్ రెడ్డి తదితరులున్నారు.

భూములు ఇవ్వడమే త్యాగమా?

భూములు ఇవ్వడమే త్యాగమా?

రాజధాని కోసం అమరావతి రైతులు 33వేల ఎకరాలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘రాష్ట్రం కోసం భూములు ఇవ్వడమే గొప్ప త్యాగం అనుకుంటే గనుక సీమవాసులు చేసిన త్యాగాలు వెలకట్టలేనివి. అమరావతి రైతులకు కనీసం అభివృద్ధి చెందిన భూమైనా తిరిగి దక్కుతుంది. కానీ.. శ్రీశైలం ప్రాజెక్టు కోసం సీమ రైతులు 80 వేల ఎకరాల సాగుభూమిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇచ్చేశారు. ఈరోజుకు కూడా వారికి కనీస పరిహారం దక్కలేదు. దీనిపై ఏ ఒక్కరూ మాటమాత్రంగానైనా స్పందిచరు. గతాన్ని గుర్తుంచుకుని గ్రేటర్ రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలి''అని లేఖలో రాసుకొచ్చారు.

త్యాగాలకు కూడా హద్దుంటుంది..

త్యాగాలకు కూడా హద్దుంటుంది..

ఏడు దశాబ్దాలుగా రాయలసీమలో రాజధాని డిమాండ్ సజీవంగా ఉందన్న మాజీ నేతులు... త్యాగాలకు కూడా ఒక హద్దుంటుంది అంటూ జగన్ సర్కారును పరోక్షంగా హెచ్చరించారు. రాజధానిపై ఏర్పాటైన కమిటీల నిఘంటువుల్లో... మనోభావాలు, త్యాగాలు, ఆత్మగౌరవం, హక్కులు లాంటి పదాలకు అర్థాలు దొరకవని, ప్రజల నుంచి వచ్చినవాళ్లకు మాత్రమే వాటి అర్థాలు తెలుస్తాయని, ప్రభుత్వం గనుక సీమ ఆవేదనను అర్థం చేసుకోకపోతే పర్యవసానాలు మరోలా ఉంటాయని మైసూరా రెడ్డి అండ్ కో లేఖలో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+