నా కొడుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు, నేను కౌన్సిలర్‌గా..: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనం
అనంతపురం: తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు అశ్మిత్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతారని తెలిపారు. ఇప్పటి వరకు తనపై చూపిన ఆదరాభిమానాలను తన కుమారుడిపై చూపాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అశ్మిత్ ఇప్పటికే ప్రజాసేవలో ఉన్నాడని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. స్పర్శ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలకు చేయూతనందిస్తున్నాడని చెప్పారు. తన లక్షణాలనే పుణికిపుచ్చుకున్న అశ్మిత్.. తాడిపత్రి నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ.. ఇతర నియోజకవర్గాలకు మార్దదర్శకంగా నిలుస్తాడని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

అయితే, తాను రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేస్తానని తెలిపారు.
కౌన్సిలర్‌గా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి.. తాడిపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభాకర్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications