మాట్లాడుతుండగా నిలిచిపోయిన విద్యుత్తు సరఫరా!!
ఉదయం నిద్ర లేవగానే పవన్ కల్యాణ్ ను తిట్టాలని, తిట్టకపోతే సాయంత్రానికి పదవి పోతుందని కాపు సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులకు భయం పట్టుకుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కేవలం పవన్ కల్యాణ్ ను విమర్శించడం కోసమే రాజమండ్రిలో వైసీపీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలాన్ని ఇచ్చిన గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామస్తులతో మనోహర్ సమావేశమయ్యారు.
భూములు ఇచ్చినందుకు పవన్ రూ.50 లక్షలు విరాళం ఇవ్వడంతో వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై గ్రామస్థులతో చర్చించారు. గ్రామంలో ఉన్న కమ్యూనిటీ హాల్‌ను వైసీపీ నాయకులు పడగొట్టి మళ్లీ కట్టారని గ్రామస్తులు మనోహర్ దృష్టికి తెచ్చారు. విరాళాలతో నిర్మించిన భవనానికి వైఎస్‌ఆర్ పేరు ఎలా పెడతారని నాదెండ్ల ప్రశ్నించారు. జగన్ పాలనలో కాపు ప్రజానీకానికి చాలా చేశామని చెబుతున్నారని, రైతుల ధాన్యం డబ్బును కూడా కులాలవారీగా చూడటం అన్నింటికన్నా దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో పర్యటించకుండా ప్రభుత్వమే అడ్డుకుందని, భవిష్యత్తులో పార్టీ తరఫున చేయబోయే కార్యక్రమాలన్నీ ప్రభుత్వానికి నిరసన తెలిపేవిగానే ఉంటాయని, కీలకమైన నేతలతో చర్చించి పోరును ఉధృతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.













Click it and Unblock the Notifications