వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కీలక నేత నాదెండ్ల మనోహర్ రాజీనామా ? .. జనసేనపై మరో దుమారం ... రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

జనసేన పార్టీపై తాజాగా మరో దుమారం మొదలైందా? జనసేన పార్టీలో ఉన్న ఓ కీలక నేత పార్టీ వీడి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా? బిజెపి తో పవన్ చేస్తున్న దోస్తీ అందుకు కారణమా? ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ బిజెపి జాతీయ నాయకుల గురించి చేసిన వ్యాఖ్యలు ఆ నేతకి రుచించలేదా? ఆయన జనసేన పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారా? ఇక ఈ ప్రచారంపై జనసేన పార్టీ ఏం చెప్తుంది? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

జనసేన పార్టీని వీడి వెళ్తున్న నేతలు

జనసేన పార్టీని వీడి వెళ్తున్న నేతలు

గత అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి సత్తా చాటాలని చూసిన జనసేన పార్టీ చిత్తుగా ఓడిపోయింది. తాను పోటీచేసిన రెండు స్థానాల్లోనూ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. ఈ ఘోర ఓటమితో జనసేన శ్రేణులు పూర్తిగా డీలా పడినా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం పార్టీని ముందుకు నడిపించాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా మంది నేతలు జనసేన ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి పార్టీకి గుడ్ బై చెప్పి పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు.

గుంటూరు జిల్లా సమీక్షా సమావేశానికి హాజరుకాని నాదెండ్ల ..ప్రచారం షురూ

గుంటూరు జిల్లా సమీక్షా సమావేశానికి హాజరుకాని నాదెండ్ల ..ప్రచారం షురూ

ఇప్పటికే రావెల కిశోర్ బాబు జనసేనకు రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీ గూటికి చేరబోతున్నారు. ఈ క్రమంలో మరో కీలక నేత నాదెండ్ల మనోహర్‌పైనా ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా జనసేన పార్టీని వీడి వెళ్లిపోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం లేకపోలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా నిర్వహించిన గుంటూరు జిల్లా సమీక్షకు నాదెండ్ల మనోహర్ హాజరుకాలేదు. ఇక ఆయన కూడా రావెల కిశోర్ బాబు బాటలోనే పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది.

అమెరికా పర్యటనలో ఉన్న నాదెండ్ల మనోహర్ .. పుకార్లు నమ్మొద్దన్న జనసేన

అమెరికా పర్యటనలో ఉన్న నాదెండ్ల మనోహర్ .. పుకార్లు నమ్మొద్దన్న జనసేన

ఆయన ఏ కారణాలతో హాజరు కాలేదో తెలీదు కానీ సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం జోరందుకుంది. త్వరలోనే ఆయన జనసేనకు గుడ్‌బై చెబుతారని ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో నాదెండ్ల వ్యవహారంపై జనసేన పార్టీ స్పందించింది. ఆయన సైతం క్లారిటీ ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ అమెరికా పర్యటనలో ఉన్నారని, అందుకే సమావేశానికి హాజరుకాలేకపోయారని తెలిపింది. దీనిపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, నాదెండ్ల పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది.

జనసేన పార్టీలో కీలకంగా నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీలో కీలకంగా నాదెండ్ల మనోహర్

వాస్తవానికి పవన్ కు జనసేన పార్టీలో సపోర్టింగ్ గా నిలుస్తున్న నేత నాదెండ్ల మనోహర్ . ఇక ఆయన పార్టీకి దూరమైతే ఇక పెద్దగా చెప్పుకోదగిన నాయకులెవరు ఆయన పార్టీలో లేరనే చెప్పాల్సిన పరిస్థితి. నాదెండ్ల మనోహర్ గత ఏడాది అక్టోబర్ లో జనసేన పార్టీలో చేరి, గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ జనసేన పార్టీ లోనే కొనసాగుతూప్రజా సమస్యల విషయంలో పవన్ కళ్యాణ్ తో కలిసి పోరాటం చేశారు నాదెండ్ల మనోహర్.

పార్టీలో నెంబర్ 2 గా నాదెండ్ల ... రాజీనామా ప్రచారానికి చెక్ పడినట్టేనా ?

పార్టీలో నెంబర్ 2 గా నాదెండ్ల ... రాజీనామా ప్రచారానికి చెక్ పడినట్టేనా ?

ఇక పార్టీ ఓడిపోయినా సరే ఆయన మాత్రం పవన్ వెంటే నడిచారు.పార్టీలో ఆయన నెంబర్ 2 అన్న అభిప్రాయం ఉంది. పవన్ కళ్యాణ్ కు రాజకీయ అనుభవం లేకపోవడంతో ఆయన నాదెండ్ల మనోహర్ సలహాలు సూచనలు తీసుకుంటారని తెలుస్తుంది. ఇక ఆయన కూడా పార్టీ వీడి వెళ్లిపోతున్నారని , ఆయనకు పవన్ వ్యవహార శైలి నచ్చటం లేదని తెగ ప్రచారం జరుగుతుంది.కానీ ఆయన అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు . ఇక ఆయన పార్టీని వీడి వెళతారు అన్న ప్రచారానికి చెక్ పడినట్టేనా లేదా అన్నది తెలియాల్సి ఉంది .

English summary
It is being rumored that Janasena key leader Nadendla Manohar will resign. There is a large-scale campaign that he too is leaving the Janasena party. Nadendla Manohar did not attend the recent Guntur district review conducted by Janasena chief Pawan Kalyan. It is being rumored that he too will leave the party in the wake of Ravela Kishore Babu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X