కాల్ మనీ వేధింపుల వల్లే నాగగణేష్ ఆత్మహత్య: భార్యాపిల్లలను అప్పగించాలని బెదిరింపులు

ఏలూరు/ కాకినాడ: ఇటీవల జరిగిన పాలవ్యాపారి నాగ గణేష్ ఆత్మహత్యకు కాల్ మనీ ముఠా వేధింపులే కారణమని చెబుతున్నారు. వడ్దీ వ్యాపారుల వేధింపులు తాళలేక నాగ గణేష్ అనే పాలవ్యాపారి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ మేరకు అతను సూసైడ్ నోట్ రాశాడు. వడ్డీ వ్యాపారి వద్ద రూ. 18 వడ్డీ చొప్పున లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. శనివారం రాత్రి అతను ఉరేసుకుని ఇంట్లో మరణించాడు.

Naga ganesh death is due to call money threats

అప్పు తీర్చకపోతే భార్యాపిల్లలను అప్పగించాలని కాల్ మనీ ముఠా బెదిరించిందని, దాంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని నాగ గణేష్ భార్య ఆరోపిస్తోంది. అతని ఆత్మహత్యకు కాల్ మనీ ముఠాయే కారణమని పోలీసులు కూడా తేల్చారు.

ఇదిలావుంటే, తూర్పు గోదావరి జిల్లాలో వడ్డీ వ్యాపారులు ఇళ్లు, దుకాణాల్లో పోలీసులు పెద్ద యెత్తున సోదాలు నిర్వహించారు. ప్రామిసరీ నోట్లను, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం పోలీసులు దాడులు చేసి ముగ్గురు వ్యాపారులను అరెస్టు చేశారు. డ్యాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+