విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గొంతు పిసికి బూడిద చేశారు, చెవిపోగులే కీలకం: నాగవైష్ణవి కేసు, అసలేం జరిగింది?

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో ఎనిమిదేళ్ల తర్వాత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆస్తి తగాదాలతో చిన్నారి కిడ్నాప్, హత్య చోటు చేసుకుంది. కూతురు లేదన్న వార్త విని తండ్రి ప్రభాకర రావు గుండెపోటుతో మృతి చెందారు. ఈ క్రమంలో కారు డ్రైవర్ కూడా హత్యకు గురయ్యారు. నాగవైష్ణవి దారుణ హత్య, డ్రైవర్ హత్య, కూతురు బాధతో తండ్రి మృతి నాడు అందరినీ కంటతడి పెట్టించింది.

చిన్నారి నాగవైష్ణవి దారుణ హత్య కేసు: ముగ్గురు నిందితులకు జీవితఖైదుచిన్నారి నాగవైష్ణవి దారుణ హత్య కేసు: ముగ్గురు నిందితులకు జీవితఖైదు

నాగవైష్ణవి హత్య తర్వాత సాక్ష్యాధారాలు దొరకకుండా చేయడానికి ఆమె మృతదేహాన్ని ఇనుము కరిగించే బాయిలర్లో వేసి బూడిద చేశారు. ఈ కేసులో చిన్నారి చెవిపోగులు కీలకంగా మారాయి. వీటి ఆధారంగా కేసును ఛేదించారు. కేసులో నిందితులు ఏ1 మొర్ల శ్రీనివాసరావు, ఏ2 వెంపరాల జగదీష్, ఏ3 పంది వెంకట్రావ్‌లకు న్యాయస్థానం గురువారం జీవిత ఖైదు విధించింది.

హత్య, అపహరణ నేరాలు రుజువు కావడంతో నేరస్తులకు జీవిత ఖైదు విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ తీర్పుపై నిందితులు పైకోర్టులో అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పించారు. కోర్టు తీర్పు పట్ల నాగవైష్ణవి బంధువులు, విద్యార్థి, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తీర్పు కోసం ఏకంగా ఎనిమిదిన్నరేళ్లు పట్టడంపై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం పోరాడిన నాగవైష్ణవి తల్లి నర్మదాదేవి గతేడాది మృతిచెందారని, ఆమె బతికుండగానే తీర్పు వస్తే ఆ కుటుంబానికి స్వాంతన కలిగేదంటున్నారు.

నాగవైష్ణవి పేరిట ఆస్తులు కూడబెడుతున్నాడని మొదటి భార్య సోదరుడి ఆగ్రహం

నాగవైష్ణవి పేరిట ఆస్తులు కూడబెడుతున్నాడని మొదటి భార్య సోదరుడి ఆగ్రహం

2010 జనవరిలో పలగాని నాగవైష్ణవ హత్య జరిగింది. బీసీ సంఘం నేత, వ్యాపారి పలగాని ప్రభాకర్ తన అక్క కూతురు వెంకటరామమ్మను పెళ్లి చేసుకున్నారు. వారికి దుర్గాప్రసాద్ అనే కొడుకు ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత ప్రభాకర్ నిజామాబాద్ జిల్లాకు చెందిన నర్మదను రెండో పేళ్లి చేసుకున్నారు. ఆ దంపతులకు సాయితేజష్, నాగవైష్ణవిలు సంతానం. పాప నాగవైష్ణవి పుట్టిన తర్వాతే తన దశ తిరిగింది ప్రభాకర్ నమ్మకం. ప్రభాకర్ తన ఆస్తులన్నింటిని నాగవైష్ణవి పేరిట పెడుతున్నారన్న భావన మొదటి భార్య సోదరుడు పంది వెంకట్రావులో ఏర్పడింది. దీంతో వైష్ణవిని చంపాలని వెంకట్రావు.. తన చిన్నమ్మ కొడుకు శ్రీనివాస రావుతో రూ.కోటికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. జనవరి 30న చిన్నారి వైష్ణవిని కిడ్నాప్ చేసి చంపేశారు. ఆ తర్వాత శవాన్ని బాయిలర్లో వేసి బూడిద చేశారు. ఈ కేసులో విచారణ పూర్తి కావడంతో తుది తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

నిందితులకు బెయిల్ రాకుండా విచారణ పూర్తి

నిందితులకు బెయిల్ రాకుండా విచారణ పూర్తి

ముగ్గురు నిందితులు ఏడేళ్లుగా జైల్లో ఉంటున్నారు. వారికి బెయిల్ రాకుండానే విచారణ పూర్తి చేశారు. పలగానిప్రభాకర్ మొదటి భార్య తమ్ముడు పంది వెంకట్రావు ఈ కేసులో ఏ3 నిందితుడిగా ఉన్నాడు. నిందితులపై పోలీసులు ఐపీసీ 302, 307, 364, 201, 427, 379, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఛార్జీషీటు దాఖలు చేశారు.

ఆ రోజు ఏం జరిగిందంటే, తప్పించుకున్న సోదరుడు

ఆ రోజు ఏం జరిగిందంటే, తప్పించుకున్న సోదరుడు

2010 జనవరి 30న నాగవైష్ణవి కారులో స్కూల్‌కు వెళ్తుండగా.. నడి రోడ్డుపై కారు డ్రైవర్ లక్ష్మణరావును హతమార్చి, చిన్నారిని కిడ్నాప్ చేశారు దుండగులు. ఆ తర్వాత ఆమెను అత్యంత పాశవికంగా చంపేశారు. అదే కారులో ఉన్న నాగవైష్ణవి సోదరుడు కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్నాడు. అ తర్వాత తండ్రి ప్రభాకర్ రావు మనోవేధనతో మృతి చెందగా, నాగవైష్ణవి తల్లి నర్మద కూడా ఆ తర్వాత మానసికక్షోభతో కన్నుమూసింది.

రెండో పెళ్లి తర్వాత కుటుంబంలో ఘర్షణలు

రెండో పెళ్లి తర్వాత కుటుంబంలో ఘర్షణలు

ప్రభాకర రావుకు నలుగురు సోదరులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు. ఉమ్మడి కుటుంబం. ప్రభాకరరావు పెద్దవాడు. సోదరి వెంకటేశ్వరమ్మకు వివాహం చేశాక.. కొద్దికాలానికి భర్త చనిపోయాడు. దీంతో ఆమె తన కొడుకు, కూతురును తీసుకొని సోదరుడి వద్దకు వచ్చింది. సోదరి కూతురును ప్రభాకర రావు పెళ్లి చేసుకున్నాడు. వారికి పిల్లలు పుట్టి చనిపోయారు. ప్రభాకర రావు.. నర్మదను రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి కుటుంబంలో ఘర్షణలు మొదలయ్యాయి. రెండో భార్య కూతురు నాగవైష్ణవి. కూతురు కోసం ప్రభాకర రావు ఎక్కువ సమయం అక్కడే ఉండటంతో మొదటి భార్య, సోదరుడు వెంకట్రావులు అతనితో వాదనకు దిగేవారు.

కేసులో కీలకంగా మారిన వజ్రపు చెవిపోగులు

కేసులో కీలకంగా మారిన వజ్రపు చెవిపోగులు

ఈ గొడవల నేపథ్యంలో నాగవైష్ణవి కిడ్నాప్, హత్య జరిగింది. ఆమెను ఎత్తుకెళ్లిన దుండగులు విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్లారు. మార్గమధ్యలో గొంతునులిమి చంపేశారు. ఆనవాళ్లు దొరక్కుండా గుంటూరు ఆటో నగర్‌లోని ఐరన్ బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఆమె మృతదేహాన్ని ఉంచి, ఎముకలు కూడా కరిగిపోయే విధంగా వేడి చేసి బూడిద చేశారు. బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి చిన్నారి చెవి పోగులను సేకరించిన దర్యాఫ్తు అధికారులు ఎఫ్ఎస్ఎల్‌కు పంపించారు. వజ్రం కావడంతో హత్య కేసు విచారణలో కీలకంగా మారింది.

డ్రైవర్ హత్యప్రత్యక్ష సాక్షుల కథనం

డ్రైవర్ హత్యప్రత్యక్ష సాక్షుల కథనం

దీంతో పాటు కారు డ్రైవర్ లక్ష్మణ రావును హత్య చేసిన సమయంలో చూసిన ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. కిడ్నాప్‌కు గురైన నాగవైష్ణవి తిరిగి వస్తుందని తల్లిదండ్రులు ప్రభాకర రావు, నర్మదలు వేచి చూశారు. కానీ పర్నేస్‌లో దొరికింది చిన్నారి మృతదేహం అని తెలియడంతో తండ్రి గుండె ఆగిపోయింది. ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. నాగవైష్ణవి హత్య, తండ్రి గుండె ఆగి మరణించడం సంచలనం రేకెత్తించింది.

ప్రాసిక్యూషన్ 79 మంది, డిఫెన్స్ 30 మంది సాక్ష్యులను విచారించారు

ప్రాసిక్యూషన్ 79 మంది, డిఫెన్స్ 30 మంది సాక్ష్యులను విచారించారు

అప్పుడు హోంమంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశారు. ఈ కేసు విచారణ ఎనిమిదేళ్ల పాటు జరిగింది. కేసులో ప్రాసిక్యూషన్ 79 మంది సాక్ష్యులను, డిఫెన్స్ 30 సాక్ష్యులను విచారించింది. ప్రభాకర రావు బావమరిది పంది వెంకట్రావును కుట్రదారునిగా కేసులో పేర్కొన్నారు. కన్నకూతురు, కట్టుకున్న భర్త మృతి చెందిన బాధకు తోడు బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా నర్మద కూడా ఆ తర్వాత మృతి చెందారు. కేసు విచారణ కోసం నర్మద పోలీసులను పలుమార్లు కలిశారు.

English summary
Naga Vaishnavi (January 21, 2000 – February 2, 2010) was the daughter of Palagani Prabhakara Rao, a noted businessman in Andhra Pradesh, and his second wife Narmada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X