హిట్లర్ కన్నా..ప్లీజ్ జగన్ రెడ్డిగారు: వైసీపీ నేతలకు రైతులు చేసే సన్మానం చూడాలని ఉంది: నాగబాబు

అమరావతిలో సాగుతన్న ఆందోళనల పైన జనసేన నేత..మెగా బ్రదర్ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యవహారం పైన వరుస ట్వీట్లు చేసారు. అందులో హిట్టర్ అంశాన్ని ప్రస్తావించిన నాగబాబు.. ఆయన కన్నా గొప్ప వాళ్లు ఎవరూ లేరని..అలాంటి హిట్లర్ కూడా నాశనం అయిపోయాడని గుర్తు చేసారు. దీనికి కొనసాగింపుగా జగన్ రెడ్డి గారు ఆ తప్పు చేయండి..యు హావ్ స్టిల్ టైం యు కరెక్ట్ యువర్ హాస్టీ డెసిషన్ అని పోస్టింగ్ చేసారు.

అదే సమయంలో రాజధాని రైతులపై తప్పుడు కామెంట్స చేసే అధికార పార్టీ ఎమ్మెల్యేలు..వారి గదుల్లో కాకుండా ఒకసారి రాజధాని ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టి మాట్లాడాలన్నారు. అప్పుడు వారికి రైతులు చేసే సన్మానం కళ్లారా చూడాలని ఉందంటూ నాగబాబు చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.

Nagababu suggested CM Jagan to change his hasty decision on capital shifting

వైసీపీ నేతలకు సన్మానం చేస్తే..

అమారవతి రైతులకు మద్దతుగా ఇప్పటికే జనసేన నుండి మెగా బ్రదర్ నాగబాబు..నాదెండ్ల మనోహర్ ఆ ప్రాంతంలో పర్యటించి రైతులకు మద్దతు ప్రకటించారు. పవన్ సైతం ఆందోళనల్లో పాల్గొన్నారు. ఇక, వారికి మద్దతుగా కవాతు నిర్వహణ పైన జనసేనాని కసరత్తు చేస్తున్నారు. ఈ సమయంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల పైన నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

అందులో ప్రధానంగా హిట్లర్ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. యూదుల మీద పగబట్టి వాళ్ళ జాతిని నాశనం చేసిన ఆడాల్ఫ్ హిట్లేర్ కన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు.అలాంటి హిట్లర్ కూడా నాశనం అయిపోయాడు.ప్లీస్ జగన్ రెడ్డి గారు మీరు ఆ తప్పు చేయకండి.యు హావ్ స్టిల్ టైం టు కరెక్ట్ యువర్ హాస్టీ డెసిషన్ అంటూ ట్వీట్ చేసారు.

మరో ట్వీట్ లో వైసీపీ నేతల వ్యాఖ్యలను తప్పు బడుతూ నాగబాబు మరో ట్వీట్ చేసారు. అందులో... రాజధాని రైతులపై తప్పుడు కామెంట్స్ చేసే అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. వారి గదుల్లో కాకుండా ఒకసారి రాజధాని ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టి మాట్లాడాలన్నారు. అప్పుడు వారికి రైతులు చేసే సన్మానం కళ్లారా చూడాలని ఉందని ట్వీట్ చేశారు.

ఇక, అదే విధంగా..రాజధాని రైతుల పోరాటం నిజంగా ప్రశంసనీయమని నాగబాబు ప్రశంసించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరికి రైతుల పోరాటం స్ఫూర్తి దాయకమని...మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానంటూ నాగబాబు ట్వీట్ చేసారు. మరో ట్వీట్ లో.. మీ పోరాటం వృధా పోకూడదని కోరుతున్నానని... గుడి కి వెళ్తున్న వారి మీద లాఠీచార్జి చేస్తున్నారని న్యూస్ లో చెప్తున్నారు.అదే నిజమైతే అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు..అంటూ నాగబాబు ఆవేదన వ్యక్తం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+