జానీ మాస్టర్‌కు మద్దతుగా నాగబాబు..''తప్పు చేసినోడు మనోడైతో ఓకేనా''

జానీ మాస్టర్ వివాదం అందరికి తెలిసిందే. తన దగ్గర పని చేస్తోన్న మహిళా కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.జానీ మాస్టర్ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు.ఆయన తొలుత నార్త్ ఇండియాలో ఉన్నారన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన పోలీసులను జానీ మాస్టర్ బురిడీ కొట్టించి పారిపోయారని తెలుస్తోంది. దీంతో జానీ మాస్టర్ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. తాజాగా జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

తాజాగా ఈ వివాదంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. జానీ మాస్టర్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.ఆ ట్వీట్‌లో నాగబాబు...''నేరం నిరూపితం అయ్యే వరకు ముద్దాయి నిరపరాధే అని ఫేమస్ కొటేషన్‌''ను ఆయన షేర్ చేశారు. అంతే కాకుండా మరో ట్వీట్‌లో.. విన్నవన్నీ నిజాలు కావు.. ఓ ఘటనకు మూడు రకాల కథనాలు ఉంటాయి.. నీది, అవతలి వాళ్లది.. అసలు నిజం.. ఇలా మూడు రకాల కోణాలుంటాయాంటూ మరో ఫేమర్ రైటర్ రాసిన కొటేషన్‌ను షేర్ చేశాడు. ఈ ట్వీట్‌తో నాగబాబు జానీ మాస్టర్‌కు మద్దతుగా నిలిచారని అందరికి అర్థం అవుతోంది. కాకపోతే జానీ మాస్టర్‌ పేరును ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ కేసులో తెలియని కోణాలెన్నో ఉన్నాయని, నిజానిజాలు తేలే వరకు ఆగండి అని అందరికీ సూచిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

Nagababu tweet in support of Johnny Master

అయితే నాగబాబు ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆడపిల్లకు అన్యాయం జరిగితే బాధితురాలికి అండగా ఉండకుండా, నిందితుడికి మద్దతుగా నిలవడం ఏంటని నెటిజన్లు మెగా బ్రదర్‌ను ప్రశ్నిస్తున్నారు. తప్పు చేసినోడు మనోడైతో ఓకేనా అంటూ ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక గోవాలో జానీ మాస్టర్‌ను చేసిన పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి గోవా కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఈ రోజు సాయంత్రానికి జానీ మాస్టర్‌ను హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత అతన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

అలాగే పోలీసులు జానీ మాస్టర్‌‌ను కస్టడీ కోరే అవకాశం ఉంది. మరోవైపు జానీ మాస్టర్ లైంగిక వేధింపులపై సినీ ఇండస్ట్రీ సీరియస్‌గానే రియాక్ట్ అయింది. దీనిపై మీడియా సమావేశం నిర్వహించి, బాధితురాలికి అండగా నిలవడం జరిగింది. అత్యాచార ఆరోపణలతో ఫిలిం ఛాంబర్ సైతం జానీ మాస్టర్‌పై చర్యలు తీసుకుంది.అతన్ని డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజ నిర్ధారణ జరిగే వరకు ఈ నిషేదం అమల్లో ఉంటుందని ఫిలిం ఛాంబర్ ఓ నోట్ విడుదల చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+