• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లోకేష్ హాస్యనటుడు రేలంగిలా తయారయ్యాడట ... నాగబాబు జబర్దస్త్ పంచ్

|
  AP Assembly Election 2019 : హాస్యనటుడు రేలంగిలా తయారైన లోకేష్ : నాగబాబు | Oneindia Telugu

  ఏపీ మంత్రి నారా లోకేష్ కు ఎక్కడలేని తిప్పలు వచ్చి పడ్డాయి. లోకేష్ పొలిటికల్ ఎంట్రీ నుండీ ఇప్పటి వరకు లోకేష్ టార్గెట్ గా బోలెడన్ని సెటైర్లు వచ్చాయి . సోషల్ మీడియా లో బాబు చేసిన పొరబాట్లు ఫుల్ గా వైరల్ అయ్యాయి. ఇప్పుడు కొత్తగా మరో సెటైర్ ఆయనను బాగానే ఇబ్బంది పెట్టేలానే ఉందని చెప్పక తప్పదు. రీసెంట్ గా జనసేన పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన మెగా బ్రదర్ నాగబాబు లోకేష్ బాబును పాత తరం కమెడియన్ రేలంగితో పోల్చారు.

  రాజకీయాల్లో జబర్దస్త్ పంచ్ లతో సెన్సేషన్ సృష్టిస్తున్న నాగబాబు

  రాజకీయాల్లో జబర్దస్త్ పంచ్ లతో సెన్సేషన్ సృష్టిస్తున్న నాగబాబు

  మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగానే సినిమాల్లోకి వచ్చిన నాగబాబు... సినిమాల్లో తనకంటూ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేదు. బుల్లితెరపై మాత్రం జబర్దస్త్ షోతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. జబర్దస్త్ జడ్జ్ గా వ్యవహరించిన ఆయన ఈ మధ్య అందరిపై జబర్దస్త్ సెటైర్లు వేస్తున్నారు. ఒకప్పుడు సైలెంట్ గా తనపని ఏమిటో తాను చేసుకుపోయిన నాగబాబు బాలకృష ఎవరో తెలీదని స్టార్ట్ చేసిన రగడ నేటికీ నాగబాబుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తుంది. ఇప్పుడు రాజకీయాలలో కాలుపెట్టి జబర్దస్త్ నుండి నేర్చుకున్న పంచ్ లతో సెన్సేషన్ సృష్టిస్తున్నారు మెగా బ్రదర్ నాగబాబు .

  జనసేన నుండి ఎన్నికల బరిలో... చంద్రబాబు, లోకేష్ లే టార్గెట్ గా నాగబాబు ప్రచారం

  జనసేన నుండి ఎన్నికల బరిలో... చంద్రబాబు, లోకేష్ లే టార్గెట్ గా నాగబాబు ప్రచారం

  తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరిపోయిన నాగబాబు... ఏకంగా తన సొంత జిల్లా తూర్పు గోదావరిలోని నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగారు . సొంత జిల్లా కావడం - పవన్ మేనియాతో ఎంపీగా తాను గెలిచేస్తానన్న ధీమాతో ఉన్న నాగబాబు... ప్రచారం కూడా హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీలో నెంబర్ టూగా ఉన్న లోకేశ్ పై ఆయన ప్రచారంలో పవర్ పంచ్ లు వేశారు. అధికార పార్టీ టార్గెట్ గా ప్రచారం సాగిస్తున్న నాగబాబు వేస్తున్న పంచ్ లతో చిన్నబాబు చిరాకు పడుతున్నారు.

  లోకేష్ ను హాస్యనటుడు రేలంగి తో పోలుస్తూ నాగబాబు పంచ్

  లోకేష్ ను హాస్యనటుడు రేలంగి తో పోలుస్తూ నాగబాబు పంచ్

  ఇక చిన్నబాబు లోకేష్ బాబుపై నాగబాబు వేసిన సెటైర్ ఏమిటంటే లోకేష్ వ్యవహారం చూస్తుంటే... హాస్యనటుడు రేలంగిలా తయారయ్యారట. లోకేశ్ చేసే కామెడీ ముందు ‘జబర్దస్త్' ఏమాత్రం చాలదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు పైనా నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మానసిక పరిస్థితి సరిగా లేదని వ్యాఖ్యానించిన నాగబాబు... తాడేపల్లి గూడెం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈలి నానీని వదిలిపెట్టలేదు. నానీకి నవ్వడమే తప్ప ఏ పనీ చెయ్యడం చేతకాదని నాగబాబు అన్నారు. మొత్తానికి జబర్దస్త్ జడ్జ్ నాగబాబు ప్రచారంలోనూ జబర్దస్త్ పంచ్ లు పేలుస్తున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Mega Brother Naga Babu made sensational comments on Minister Lokesh . Lokesh Babu's has been compared to the old generation tollywood comedian Ralangi . Nagababu's election campaign from the Narasapur constituency in the district of East Godavari nagababu talked about Lokesh with sarcasm . Lokesh is behaving like comedian Relangi and he is diong jabardsth comedy . Nagababu setires.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more