నగరి తిండివనం రైల్వే లైన్ పనుల దూకుడు..ఆ జిల్లాల దశ తిరిగినట్టే!
భారతీయ రైల్వే తన రైలు మార్గాలను ఎక్కడికక్కడ విస్తరిస్తూ దేశ ప్రగతికి దోహదం చేస్తుంది. రవాణా మార్గాలను పెంచినప్పుడు దేశం ఆర్థికంగా ప్రగతి పథంలో నడుస్తుందని భావిస్తున్న భారతీయ రైల్వే అందుకు తగ్గట్టుగా దూకుడుగా ముందుకు వెళుతుంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో రైల్వే అభివృద్ధి పనుల పైన ఫోకస్ చేస్తుంది.
రెండు దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్ట్ పరుగులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనూ కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు, రైల్వే పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రగతికి కూడా దోహదం చేస్తుంది. ఇక ఇదే సమయంలో 2008లో ప్రారంభమైన ఒక ప్రాజెక్టును ప్రస్తుతం పరుగులు పెట్టించే పనిలో పడింది రైల్వే. దాదాపు రెండు దశాబ్దాల నుంచి నత్తనడకన నడుస్తున్న నగరి తిండివనం రైలు మార్గం పనుల స్పీడ్ ను పెంచింది దక్షిణ మధ్య రైల్వే.

నగరి తిండివనం రైల్వే లైన్ పనులు వేగం
ప్రస్తుతం నగరి- పొడత్తూరు పేట రైల్వే లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో మొత్తం 184 .45 కిలోమీటర్ల రైల్వే లైను ఏర్పాటు చేయాలని 2008లో రైల్వే సంకల్పించింది. ఇక అప్పటినుండి ఇప్పటివరకు చాలా నిదానంగా పనులు జరుగుతుండగా, నగరి- పొడత్తూరు పేట రైల్వే లైన్ పనులు మొత్తం 13 కిలోమీటర్ల ఈ విస్తరణను 2026 మార్చి నాటికి పూర్తి చేస్తారని భావిస్తున్నారు.
2028నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేసే లక్ష్యం
మొత్తం ప్రాజెక్టు 2028నాటికి పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీర్ఘకాల ఆలస్యమైన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం జరుగుతున్న అనేక రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులలో భాగంగా ముందుకు వెళుతుంది. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో అమలు చేస్తున్నారు. మొదటి దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నగరి నుండి తమిళనాడులోని వాలాజా రోడ్ జంక్షన్ వరకు 65కిలోమీటర్లు, ఇక రెండవ దశ వాలాజా రోడ్డు నుండి తిండివనం వరకు 120కిలోమీటర్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ రైల్వే లైన్ తో లాభం ఇదే
ఈ రైల్వేలైన్ పూర్తయితే గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే రైళ్లు ఈ లైన్ పైన ప్రయాణం చేయవచ్చు. ఈ రైల్వే లైన్ కీలకమైన పారిశ్రామిక కేంద్రాలకు కనెక్టివిటీని పెంచుతుందని ప్రధాన గమ్యస్థానాలకు ప్రత్యామ్నాయ మార్గాలను అందిస్తుందని భావిస్తున్నారు. దీర్ఘకాలం పెండింగ్ ఉన్న ఈ ప్రాజెక్టును ఇప్పుడు స్పీడ్ పెంచి పట్టాలెక్కిస్తున్నారు.












Click it and Unblock the Notifications