ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్: చక్రం తిప్పిన బైరెడ్డి, ఏం జరిగిందంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూల్: కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పావులు కదిపారు. బైరెడ్డి వ్యూహం ఫలించింది టిడిపిలో బైరెడ్డి చేరికకు మార్గం సుగమమైంది. ఎన్నికల్లో తన అనుచరుడితో నామినేషన్ వేయించడం ద్వారా బైరెడ్డి వేసిన ప్లాన్ ఎట్టకేలకు సక్సెస్ అయింది.

రంగంలోకి కెఈ: సోదరుడికి టిక్కెట్టు కోసమిలా, అభ్యర్ధి లేకుండానే టిడిపి ప్రచారం

కర్నూల్ జిల్లా రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకొంటున్నాయి. 2013 వరకు టిడిపిలోనే కొనసాగిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీని ఏర్పాటు చేశారు. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పార్టీ అభ్యర్థి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీంతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టిడిపిలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.

బలం లేకున్నా రెండు దఫాలు టిడిపి విజయం, కర్నూల్‌లో మారిన సీన్

బైరెడ్డి టిడిపిలో చేరాలని తీసుకొన్న నిర్ణయాన్ని కర్నూల్ జిల్లాలోని కొందరు టిడిపి నాయకులు వ్యతిరేకతను వ్యక్తం చేశారని సమాచారం. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను బైరెడ్డి తనకు అనుకూలంగా ఉపయోగించుకొన్నారు.

కర్నూల్ నేతలకు బాబు షాక్: ఓట్లు తగ్గితే చర్యలు, 23న ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక

తెరవెనుక చక్రం తిప్పిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

తెరవెనుక చక్రం తిప్పిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది. అయితే ఆ సమయంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరుడు నాగిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే దాని వెనుక టిడిపి నేతలు వ్యూహత్మకంగా అడుగులు వేశారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరుడు నాగిరెడ్డి నామినేష్ ఉపసంహరణ చేసుకొనేలా బైరెడ్డిని ఒప్పించారు. ఈ సమయంలోనే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన డిమాండ్లను టిడిపి నేతల ముందుంచారు.దీంతో బైరెడ్డి టిడిపిలో చేరేందుకు మార్గం సుగమమైంది.

 చంద్రబాబుతో బైరెడ్డి సమావేశం వెనుక కెఈ కృష్ణమూర్తి

చంద్రబాబుతో బైరెడ్డి సమావేశం వెనుక కెఈ కృష్ణమూర్తి

చంద్రబాబునాయుడుతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇటీవల సమావేశమయ్యారు.ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి కీలకంగా వ్యవహరించారని సమాచారం. కెఈ కృష్ణమూర్తి సోదరుడు కెఈ ప్రభాకర్ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విషయాన్ని చంద్రబాబుతో చర్చించి ఆయనతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేయించడంలో కెఈ కీలకంగా వ్యవహరించారనే ప్రచారం కర్నూల్ జిల్లా టిడిపి వర్గాల్లో సాగుతోంది.

 సంక్రాంతి తర్వాత టిడిపిలోకి బైరెడ్డి

సంక్రాంతి తర్వాత టిడిపిలోకి బైరెడ్డి

సంక్రాంతి తర్వాత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టిడిపిలోకి చేరనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో కలిసిన తర్వాత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం మంచి రోజులు లేనందున సంక్రాంతి తర్వాత బైరెడ్డి టిడిపిలో చేరనున్నారు.

విభేధాలు మరిచి

విభేధాలు మరిచి

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టిడిపిలోకి వచ్చేందుకు చేసిన ప్రయత్నాలను అడ్డుకొన్న వారే ఆయన టిడిపిలో చేరేందుకు సమ్మతించాల్సిన పరిస్థితులు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ, శాశ్వత శత్రువులు కానీ ఉండరని వారు గుర్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former MLA Byreddy Rajasekhar Reddy was used to Kurnool mlc elections for his re entry in to Tdp. He met with Chandrababu for the withdraw of the nomination of nagi reddy in Kurnool MLC elections recently. Byreddy will join in Tdp after Sankranti.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి