మోహన్ బాబు,మంచు విష్ణులను అరెస్ట్ చెయ్యాలని ఆందోళన; ముదురుతున్న వివాదం

టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబును టార్గెట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మోహన్ బాబు దగ్గర పనిచేసే నాగ శ్రీను వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. మోహన్ బాబుపై, ఆయన కుమారుడు మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు పై నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హెచ్చార్సీలో వారిపై ఫిర్యాదు చేసిన నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు తాజాగా మోహన్ బాబును అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు.

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు విష్ణును అరెస్ట్ చేయాలంటూ తూర్పుగోదావరి జిల్లా రాజోలులో నాయి బ్రాహ్మణులు ఆందోళనకు దిగారు. రాజమండ్రికి చెందిన నాగ శ్రీనును సినీ నటుడు మోహన్ బాబు దశాబ్దకాలంగా నమ్మకంగా పని చేస్తున్నాడని, అలాంటి నాగ శ్రీను పై దొంగతనం కేసు పెట్టి, కులం పేరుతో దూషించడం తగదని నాయి బ్రాహ్మణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nai brahmins demanded to arrest Mohan Babu and Manchu Vishnu over naga srinu issue

రాజోలు తహసీల్దార్ ముక్తేశ్వరరావు ను కలిసి వినతి పత్రం అందించిన నాయి బ్రాహ్మణ సంఘం మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరిపి నిజానిజాల నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. తహసిల్దార్ ముక్తేశ్వరరావుకు వినతి పత్రం అందించిన తర్వాత నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు మానుకొండ దుర్గాప్రసాద్ ఎంతోకాలంగా వారి వద్ద పనిచేస్తున్న నాగ శ్రీనుపై ఉద్దేశపూర్వకంగా చోరీ చేసినట్టు తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు.

Recommended Video

    Bheemla Nayak: Pawan Kalyan కోసం ఒక్క హీరో ముందుకు రాలేదు Naga Babu సంచలనం | Oneindia Telugu

    నాగ శ్రీనును చిత్రహింసలకు గురిచేశారని కులం పేరుతో దూషించారని మండిపడ్డారు. మోహన్ బాబు కుటుంబం వెంటనే నాయి బ్రాహ్మణ సంఘానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్బు, అధికార బలం ఉందని అహంకారంతో నాగశ్రీనును కులం పేరుతో దూషించడం తాము ఖండిస్తున్నామని, వెంటనే వారిని అరెస్టు చేసి తగిన చర్య తీసుకోవాలని నాయి బ్రాహ్మణ సంఘం డిమాండ్ చేస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+