Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పట్టిసీమతో సత్తా నిరూపించాం, పోలవరంతోనే వెలుగు: చంద్రబాబు(పిక్చర్స్)

పశ్చిమగోదావరి: పట్టిసీమ ద్వారా తొలి విజయం సాధించి సత్తా నిరూపించుకున్నామని, ఇదే స్పూర్తితో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రంలో కరవు లేకుండా చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సోమవారం పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడనికి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదలచేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్న భూమిని పర్యాటకంగా కీలకమైన స్థానంగా మార్చడానికి పలు సూచనలు చేశారు. ఈ ప్రాంతంలో 200 ఎకరాల భూమి ఉందని, ఆ ప్రాంతంలో అద్భుతమైన గార్డెన్స్ అభివృద్ధిచేయాలని కాంట్రాక్టు సంస్థ మెగా ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధి కృష్ణారెడ్డిని కోరారు. ఇందుకు అవసరమైన సహకారం అందిస్తామని, ఇక్కడ గార్డెన్స్ అభివృద్ధిచేసి, వాటిని నిర్వహించాల్సిన బాధ్యతను తీసుకోవాలని సూచించారు.

అలాగే ఎవరైనా ముందుకొస్తే ఈప్రాంతంలో మంచి హోటల్‌ను కూడా నిర్మించడానికి అవకాశం ఉందన్నారు. ఈప్రాంతంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే క్రమంలో సమీపంలో ఉన్న పట్టిసాచల క్షేత్రాన్ని అభివృద్ధిచేయడానికి రూ.70 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఒకపక్క వనాలు, మరోపక్క ప్రాజెక్టు, ఇంకోపక్క ఆధ్యాత్మికత ఉట్టిపడే పట్టిసాచల క్షేత్రంతో పర్యాటకరంగం ఊపందుకుంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి సూచనలకు మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఆమోదం తెలిపింది. రానున్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా పెద్దఎత్తున వనాల అభివృద్ది చేపడతామన్నారు.

బృందావన్ గార్డెన్స్ కన్నా పెద్దస్థాయిలో ఈ వనాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఇక పోలవరం రెవిన్యూ పరిధిలోని కొత్తూరులోని చెర్వుకు పోలవరం కుడికాల్వ ద్వారా నీటిని అందించాలని సభలో పలువురు విజ్ఞప్తులు చేశారు. దీనికి ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తూ కొత్తూరు చెర్వుకు నీరు అందిస్తామని, ఇప్పటికే దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశామని చెప్పారు. రోజుల వ్యవధిలోనే చెర్వుకు నీరు వస్తుందని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. అలాగే పట్టిసం ప్రాంతంలో రోడ్లను విస్తరించి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

పోలవరంతో వెలుగు

తెలుగుజాతికి వెలుగు పోలవరం ప్రాజెక్టుతోనే సాధ్యమవుతుందని, ఈ బృహత్తర ప్రాజెక్టుపై కేంద్ర సహకారంతో ముందుకెళ్తామని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రతి నీటిచుక్కను సాగునీటిగా మార్చటంతోపాటు ఉద్యమస్ఫూర్తితో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.

పట్టిసం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం దేశంలోనే చరిత్ర సృష్టించిందని, నదుల అనుసంధానాన్ని తొలిసారి సాకారం చేయటంతోపాటు శంకుస్ధాపన చేసిన ఏడాదికి ఒక్కరోజు ముందుగానే పూర్తి చేయగలగటం తమ ఉక్కుసంకల్పానికి నిదర్శనమన్నారు.

చంద్రబాబునాయుడు

చంద్రబాబునాయుడు

పట్టిసీమ ద్వారా తొలి విజయం సాధించి సత్తా నిరూపించుకున్నామని, ఇదే స్పూర్తితో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రంలో కరవు లేకుండా చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.

చంద్రబాబునాయుడు

చంద్రబాబునాయుడు

సోమవారం పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడనికి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదలచేశారు.

చంద్రబాబునాయుడు

చంద్రబాబునాయుడు

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్న భూమిని పర్యాటకంగా కీలకమైన స్థానంగా మార్చడానికి పలు సూచనలు చేశారు.

చంద్రబాబునాయుడు

చంద్రబాబునాయుడు

ఈ ప్రాంతంలో 200 ఎకరాల భూమి ఉందని, ఆ ప్రాంతంలో అద్భుతమైన గార్డెన్స్ అభివృద్ధిచేయాలని కాంట్రాక్టు సంస్థ మెగా ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధి కృష్ణారెడ్డిని కోరారు. ఇందుకు అవసరమైన సహకారం అందిస్తామని, ఇక్కడ గార్డెన్స్ అభివృద్ధిచేసి, వాటిని నిర్వహించాల్సిన బాధ్యతను తీసుకోవాలని సూచించారు.

చంద్రబాబునాయుడు

చంద్రబాబునాయుడు

అలాగే ఎవరైనా ముందుకొస్తే ఈప్రాంతంలో మంచి హోటల్‌ను కూడా నిర్మించడానికి అవకాశం ఉందన్నారు. ఈప్రాంతంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే క్రమంలో సమీపంలో ఉన్న పట్టిసాచల క్షేత్రాన్ని అభివృద్ధిచేయడానికి రూ.70 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

చంద్రబాబునాయుడు

చంద్రబాబునాయుడు

ఒకపక్క వనాలు, మరోపక్క ప్రాజెక్టు, ఇంకోపక్క ఆధ్యాత్మికత ఉట్టిపడే పట్టిసాచల క్షేత్రంతో పర్యాటకరంగం ఊపందుకుంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

చంద్రబాబునాయుడు

చంద్రబాబునాయుడు

ముఖ్యమంత్రి సూచనలకు మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఆమోదం తెలిపింది. రానున్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా పెద్దఎత్తున వనాల అభివృద్ది చేపడతామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+