పవన్.. దమ్ముంటే నన్ను చెప్పుతో కొట్టు: నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి సవాల్!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకుంటాయని చెప్పుకుంటున్నారని అసలు జనసేన పార్టీ ఉందా అంటూ ప్రశ్నించారు. ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానన్న పవన్ కళ్యాణ్ దమ్ముంటే కోవూరు కు వచ్చి తనను చెప్పుతో కొట్టాలని సవాల్ విసిరారు.

పవన్ కళ్యాణ్ ముమ్మాటికీ ప్యాకేజీ స్టార్ అని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. చంద్రబాబుకు పార్టీని అమ్ముకున్నాడని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు తన శీలాన్ని అమ్ముకున్నాడని పేర్కొన్న నల్లపరెడ్డి ఎన్ని వందల కోట్లు తీసుకున్నాడో పవన్, చంద్రబాబు కి తెలుసంటూ ఆరోపించారు.

Nallapareddy Prasannakumar Reddy challenge to Pawan kalyan

కనీసం చంద్రబాబు నాయుడుని కలవడానికి వెళ్లినప్పుడు నాదెండ్ల మనోహర్ ను కూడా తీసుకు వెళ్లడని, అక్కడే అర్ధమైపోతుంది కేవలం డబ్బు కోసమే జనసేన పార్టీని చంద్రబాబు పాదాల దగ్గర పెట్టాడని విమర్శలు గుప్పించారు. చిరంజీవి ఎంతో పెద్ద మనిషి అని పేర్కొని చిరంజీవికి పవన్ కళ్యాణ్ రాజకీయాలకు తేడా చెప్పారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టినా హుందాగా ఉన్నాడని, పవన్ కళ్యాణ్ కు హుందాతనమే లేదంటూ విమర్శించారు.

మెగా ఫ్యామిలీ లో చెడ పుట్టావని తిట్టిపోశారు. కాపు నాయకుడైన వంగవీటి మోహన్ రంగా ని చంపించింది చంద్రబాబు నాయుడు కాదా అంటూ ప్రశ్నించారు. అటువంటి రంగాను చంపించిన చంద్రబాబునాయుడితో చేతులు కలుపుతావా అంటూ పవన్ కళ్యాణ్ పై భగ్గుమన్నారు. 20 నుండి 25 సీట్లు చంద్రబాబు నాయుడు కి కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని, బాబుతో కలిసి కుట్రలు చేస్తున్నారన్నారు.

పవన్ కళ్యాణ్ ని ప్రజలు క్షమించరని, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఫ్యాన్స్ కూడా ఆయనను చీదరించుకుంటున్నారని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్ వైపే నిలబడతారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+