తప్పు నాదే, చెప్పుతో కొట్టినా భరిస్తా: సునీల్‌ ఇష్యుపై నల్లపురెడ్డి

నెల్లూరు: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి సునీల్‌కు గూడూరు శాసనసభ టికెట్ ఇప్పించింది తానే అని, అందువల్ల ప్రజలకు సునీల్ చేసిన మోసానికి తాను క్షమాపణ చెబుతున్నానని, అయినా కోపం తగ్గకపోతే తనను గూడూరు ప్రజలు చెప్పుతో కొట్టినా భరిస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు.

గూడూరు శాసనసభా నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి గెలిచిన సునీల్ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపైనే నల్లపురెడ్డి మాట్లాడారు. సునీల్ ఇంత దెబ్బ కొడుతారని అనుకోలేదని, సిగ్గుతో తల దించుకుంటున్నానని ఆయన అన్నారు.

Nallapureddy Prasann Kumar reddy seeks apology

సునీల్ బాగా పనిచేస్తాడని తాను జగన్‌తో చాలా సార్లు చెప్పినట్లు ఆయన తెలిపారు. కానీ తనను మోసం చేసి సునీల్ టిడిపిలో చేరారని ఆయన అన్నారు. తమ కుటుంబానికి ఏదో శాపం ఉందని, అందుకే ఇలాంటి వెన్నుపోట్లు తమ కుటుంబానికి పదేపదే ఎదురవుతున్నాయని ఆయన అన్నారు.

సునీల్ దారుణంగా వెన్నుపోటు పొడుస్తాడని తాను ఊహించలేదని ఆయన అన్నారు. సునీల్ చేసిన పనికి తాను తలెత్తుకోలేకపోతున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సునీల్ పార్టీ వీడడం వెనక తన పాత్ర లేదని ఆయన స్పష్టం చేశారు. నెల్లూరులో రాజరాజేశ్వరి దేవి, సూళ్లూరుపేట చెంగాలమ్మ, రామతీర్థం శివుళ్లపై ప్రమాణం చేస్తున్నానని, సునీల్ పార్టీ వీడడం వెనక తన పాత్ర ఉంటే తన కుటుంబం సర్వనాశనం అవుతుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+