సాక్షితో పోటీ: చంద్రబాబును టార్గెట్ చేసుకున్న నమస్తే తెలంగాణ
హైదరాబాద్: చెస్ట్ అస్పత్రి తరలింపు, రాజయ్య ఉద్వాసన వంటి పలు అంశాలపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై విమర్శల జడివాన కురిపిస్తున్న నేపథ్యంలో నమస్తే తెలంగాణ దినపత్రిక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని లక్ష్యం చేసుకుని అక్షర దాడికి దిగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ అన్యాయం జరుగుతున్న విషయాలపై మాత్రమే చంద్రబాబు వైఖరిని తప్పు పడుతూ వస్తున్న నమస్తే తెలంగాణ దినపత్రిక తాజాగా, ఆంధ్రప్రదేశ్ వార్తాకథనాలను కూడా ప్రచురిస్తూ చంద్రబాబుకు వ్యతిరేకంగా కథనాలను ప్రచురించడానికి సిద్దమైనట్లు కనిపిస్తోంది.
చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్సలకు పత్రికలో స్థానం ఇస్తూ తెలుగుదేశం ప్రభుత్వ వ్యతిరేక కథనాలకు కూడా చోటు కల్పిస్తోంది. తాజాగా, ఆంధ్రప్రదేశ్ రాజధానికి చంద్రబాబు చేపట్టిన భూసేకరణ కార్యక్రమంపై ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. చావనైనా చస్తాం.. భూములివ్వం అనే శీర్షికతో ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఇప్పటి వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక మాత్రమే చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని వార్తాకథనాలు ఇస్తూ వస్తోంది. తాజాగా, సాక్షి మీడియాతో నమస్తే తెలంగాణ పోటీ పడడానికి సిద్ధమైనట్లు అనిపిస్తోంది.
ఎపి రాజధానికి చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన భూసేకరణపై నమస్తే తెలంగాణ దినపత్రిక రాసిన వార్తా కథనం ఇలా ఉంది - ఏపీ ప్రతిపాదిత రాజధానిలో భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమం ఊపందుకుంటున్నది. చావనైనా చస్తాం కాని.. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేది లేదంటూ భూసేకరణకు వ్యతిరేకంగా పలుప్రాంతాల్లో రైతులు ఉద్యమం చేపడుతున్నారు. మా ప్రాణాల్ని తీసి మా భూములు తీసుకోండంటూ నినాదాలు చేస్తూ బుధవారం ర్యాలీ నిర్వహించారు.

భూసేకరణ ప్రక్రియను తుళ్లూరు మెట్టప్రాంత రైతులు మినహా మంగళగిరి, తాడేపల్లిలోని నదీపరివాహక ప్రాంతాల రైతుల నుంచి వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరుకుంటున్నది. భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద సంఖ్యలో 9.2 ఫారాలు పూర్తిచేసి అధికారులకు అందజేస్తున్న వారి సంఖ్య క్రమంగా ఊపందుకుంటున్నది.
ఇంకా ఆ కథనం ఇలా సాగింది - మంగళగిరి నియోజకవర్గంలో 2700 మంది రైతులు భూసేకరణకు వ్యతిరేకంగా 9.2 ఫారాలను, ఉండవల్లిలో 220, పెనుమాకలో 50, తాడేపల్లిలో 20 మంది రైతులు ఫారాలు సమర్పించారు. తాజాగా బుధవారం సుమారు వెయ్యిమందికి పైగా రైతులు భూసేకరణకు వ్యతిరేకంగా 9.2 ఫారాలు ఇవ్వడానికి తరలిరావడం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటివరకు ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో 4,320 ఎకరాలకుగానూ కేవలం 74 ఎకరాల భూములను మాత్రమే అధికారులు సేకరించారు. మంగళగిరిలో 16,523 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పటివరకు 683 ఎకరాలు మాత్రమే రైతులు ప్రభుత్వానికి అప్పగించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భూసేకరణ విధానాన్ని వ్యతిరేకిస్తున్న తరుణంలో నమస్తే తెలంగాణ ఈ వార్తాకథనాన్ని ప్రచురించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే'












Click it and Unblock the Notifications