కడప జిల్లాలో బాలకృష్ణ: ఘన స్వాగతం, భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్

అమరావతి: తన తుది శ్వాస వరకు రాయలసీమ అభివృద్ధికే పాటు పడతానని టాలీవుడ్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. గురువారం బాలకృష్ణ తన నియోజకవర్గానికి పక్కనే ఉన్న కడప జిల్లా పర్యటనకు వెళ్లారు.

రెండు రోజుల పర్యనట కోసం కడప జిల్లాకు వచ్చిన బాలకృష్ణ తొలుత జిల్లాలోని ఒంటిమిట్ట రామయ్యను దర్శించుకున్నారు. ఆనంతరం శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం మఠం, సిద్ధయ్య మఠం తదతరాలను సందర్శించుకున్నారు. సిద్ధయ్య మఠంకు వెళుతున్న క్రమంలో బద్వేలులో ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.

Nandhamuri Balakrishna Visit Kadapa District

తన తండ్రి ఎన్టీఆర్ నటించిన 'శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్ర' చిత్రంలో సిద్ధయ్యగా నటించే అవకాశం రావడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం వచ్చిన సందర్భంగానే తెలుగు గంగ పథకానికి అంకురార్పణ జరిగిందన్నారు.

తన తుదిశ్వాస దాకా రాయలసీమ అభివృద్ధికి పాటుపడతానని బాలయ్య పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పటికీ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని బాలయ్య పేర్కొన్నారు.

రెండు రోజుల పర్యనటలో భాగంగా బాలకృష్ణ శుక్రవారం కడప జిల్లా కమలాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా కమలాపురంలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ దేవాలయంలో కుంభాభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలకృష్ణకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నర్సింహారెడ్డి, పలువురు టీడీపీ నేతలు స్వాగతం పలికారు.

బాలకృష్ణను చూసేందుకు కడప జిల్లా వ్యాప్తంగా నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలను బాలకృష్ణ ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+