ప్రకాశం బ్యారేజ్ ను ఢీకొట్టిన బోట్లపై నందిగం సురేష్ పేరుందా?

మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య బేబీ లత ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన భర్త పైన తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య బేబీ లత మండిపడ్డారు .టిడిపి ఆఫీస్ పై జరిగిన దాడి కేసులో తన భర్త ప్రమేయం ఉన్నట్టు ఒక్క ఆధారమైనా చూపాలని బేబీ లత ప్రశ్నించారు.

హోంమంత్రి అనితను టార్గెట్ చేసిన నందిగం సురేష్ భార్య
హోం మంత్రి అనిత తన పదవిని కాపాడుకోవడం కోసం తన భర్త పైన తప్పుడు ఆరోపణలు చేస్తుందని, వైసిపి నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా తన భర్తను టార్గెట్ చేసి అరెస్టు చేశారని ఆమె మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు నందిగం సురేష్ అనుచరులవని ఆరోపిస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారని ఆమె మండిపడ్డారు.

Nandigam Suresh wife challenged Vangalapudi anitha to prove the allegations on her husband

ఆ బోట్లపై నందిగం సురేష్ పేరుందా
కృష్ణా నదిలో కొట్టుకొచ్చిన బోట్లపై తన భర్త పేరు ఉందా అంటూ ప్రశ్నించిన నందిగం సురేష్ భార్య వంగలపూడి అనితకు సవాల్ విసిరారు. తన భర్తకు ఈ ఘటనతో ఎటువంటి సంబంధం లేదని తన పిల్లల పైన ప్రమాణం చేస్తానని ఆమె పేర్కొన్నారు. అనిత కూడా తన బిడ్డలతో వస్తే నేను నా బిడ్డలతో వస్తానన్నారు.

నీ బిడ్డలపై ప్రమాణం చేస్తావా
వంగలపూడి అనిత తన బిడ్డలపై ప్రమాణం చేసి తన భర్త పైన చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. తాను విసురుతున్న సవాల్ ను స్వీకరించేందుకు హోం మంత్రి అనిత సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు. మాజీ ఎంపీ ని వాడు వీడు అంటూ అనిత దిగజారి మాట్లాడుతున్నారని నందిగం సురేష్ భార్య బేబీ లతా ఆగ్రహం వ్యక్తం చేశారు.

వంగలపూడి అనితకు నందిగం సురేష్ భార్య బేబీ లత సవాల్
తన భర్త పైన నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసిన ఆమె కావాలని వైసిపి నేతలను ఇబ్బంది పెట్టే కుట్రగా తన భర్త అరెస్టును అభివర్ణించారు. ఆరోపణలు కాదు ఆధారాలు చూపించాలని మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య హోం శాఖ మంత్రి వంగలపూడి అనితకు సవాల్ విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+