ఒక్క దెబ్బకు రెండు: వరుస షాక్‌లు, అఖిలను ఒంటరి చేసి.. జగన్ ప్లాన్
నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి తరఫున బరిలోకి దిగిన భూమా బ్రహ్మానంద రెడ్డి బుధవారం ఉదయం నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీతో బయలుదేరారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి తరఫున బరిలోకి దిగిన భూమా బ్రహ్మానంద రెడ్డి బుధవారం ఉదయం నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీతో బయలుదేరారు.
పలువురు మంత్రులు, పెద్ద ఎత్తున స్థానిక నేతలు, కార్యకర్తలు వెంట వచ్చారు. మంత్రి భూమా అఖిలప్రియ ఇంటి నుంచి ఆయన ర్యాలీ ప్రారంభమైంది. కార్యక్రమంలో మంత్రులు కేఈ కృష్ణమూర్తి, భూమా అఖిలప్రియ తదితరులు పాల్గొన్నారు.

ఓ వైపు ర్యాలీ, మరోవైపు చక్రపాణి రెడ్డి షాక్
నంద్యాల ఉప ఎన్నికలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. టిడిపికి షాకిస్తూ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పార్టీ కార్యాలయానికి పంపారు. ఆ లేఖ పార్టీ కార్యాలయానికి చేరింది. పార్టీలో ప్రాధాన్యత లేనందుకే రాజీనామా చేస్తున్నాని పేర్కొన్నారు.
Recommended Video


నిన్నగాక మొన్న వచ్చిన అఖిలప్రియకు ప్రాధాన్యత ఇవ్వటమా
నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వారికి దక్కుతున్న ప్రాధాన్యత తనకు దక్కడం లేదని చక్రపాణి రెడ్డి.. అఖిలప్రియను ఉద్దేశించి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను తన పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామా నంద్యాల ఉప ఎన్నికలపై ప్రభావం చూపనుందని అంటున్నారు.

అఖిలప్రియను ఒంటరిని చేస్తున్న జగన్
నంద్యాల ఉప ఎన్నికలను వైయస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అది తమ సీటు కాబట్టి అక్కడ ఎలాగైనా గెలవాలని భావిస్తున్నారు. ఈ మేరకు అవసరమైన అస్త్రాలు అన్ని ప్రయోగిస్తున్నారు. టిడిపిలో చేరిన అఖిలప్రియకు షాకిచ్చేందుకు ఆమెను ఒంటరిని చేస్తున్నారు. ఇటీవల నంద్యాలలో ముస్లీం కీలక నేత వైసిపిలో చేరారు. ఇప్పుడు శిల్పా చక్రపాణి రెడ్డి టిడిపికి రాజీనామా చేసి, గురువారం వైసిపిలో చేరనున్నారు.

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు
నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గెలిపించి ఎలాగైనా చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నదని నిరూపించాలని భావిస్తున్నారు. అలాగే, తనను అన్యాయం చేసి టిడిపిలో భూమా కుటుంబానికి గుణపాఠం చెప్పాలని జగన్ భావిస్తున్నారు.

నంద్యాలపై అన్నీ జగన్.. వెనుక ప్రశాంత్ కిషోర్
నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. బుధవారం జగన్ నంద్యాలలో పర్యటించనున్నారు. వ్యాపారస్తులు, ఆయా కుల సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి మన వైపు మళ్లించాలని జగన్ స్థానిక నేతలకు సూచించారని తెలుస్తోంది.

కాంగ్రెస్ అభ్యర్థి ఖాదర్
ఇదిలా ఉండగా, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఐఎన్‌టీయూసీ నాయకుడు షేక్ అబ్దుల్ ఖాదర్‌ను మంగళవారం ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ఖరారు చేశారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ సిఫార్సు మేరకే కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదం ప్రకారం ఖాదర్‌ను పోటీకి నిలబెడుతున్నట్లు రఘువీరారెడ్డి ప్రకటించారు.
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications