నంద్యాలలో టిడిపి గెలుపు, జగన్ అసహనం: అంతా మీవల్లే... అధినేతపై వైసిపి, కారణాలివే..
నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండులో పార్టీ ముఖ్య నేతలతో సోమవారం భేటీ అయ్యారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండులో పార్టీ ముఖ్య నేతలతో సోమవారం భేటీ అయ్యారు.
నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలపై నేతలతో సమీక్ష జరుపుతున్నారు. రౌండ్ రౌండ్‌కు టిడిపి మెజార్టీ పెరుగుతున్న విషయం తెలిసిందే. నంద్యాల ఫలితంపై జగన్ తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కినట్లుగా తెలుస్తోంది.
Recommended Video


జగన్ అసంతృప్తి
నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న సమయంలో జగన్ లోటస్ పాండులో ఉన్నారు. లోటస్ పాండులో నిరుత్సాహ వాతావరణం కనిపించింది. అందుబాటులో ఉన్న కొందరు ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమయంలో ఫలితాల సరళిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

ప్రజల నాడి పట్టలేకపోయాం
ఈ భేటీలో ఫలితాలు ప్రతికూలంగా రావడంపై చర్చ జరిగింది. ప్రజల నాడిని పట్టుకోవడంలో పార్టీ విఫలమైందని జగన్ తీవ్ర అసహనం వెళ్లగక్కారని తెలుస్తోంది.

జగన్ వైఖరిని సొంత నేతలే తప్పుబడుతున్నారు
ఇదిలా ఉంటే జగన్ వైఖరిని వైసిపి నేతలే తప్పుబడుతున్నారు. ఎవరికి ఓటు వేయాలో ప్రజలు ముందే డిసైడయ్యారని వైసిపి శ్రేణులు చెప్పుకొస్తున్నాయి. జగన్ తన 13 రోజుల ప్రచారంలో ప్రజల్లో ఏమార్పు తీసుకు రాలేకపోయారని వైసిపి నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.

చంద్రబాబుని తిట్టడానికి తప్పితే
నంద్యాల ప్రచారంలో జగన్ సీఎం చంద్రబాబును తిట్టేందుకే సమయం కేటాయించారని సొంత పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. పదేపదే సీఎంను టార్గెట్ చేయడం నంద్యాలలో వెనుకబాటుకు ప్రధాన కారణమని వైసిపి కేడర్ భావిస్తోందని సమాచారం.

స్వల్ప మెజార్టీ.. అంచనాలు తలకిందులు!
ఇదిలా ఉండగా, నంద్యాలలో టిడిపి ర్టీ హవా కొనసాగిస్తోంది. 15 రౌండ్ల వరకు ప్రతి రౌండ్‌లోనూ టిడిపి సత్తా చాటింది. ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతో గెలుస్తుందని భావించారు. కానీ భూమా బ్రహ్మానంద రెడ్డి ఇరవై వేలకు పైగా మెజార్టీతో గెలిచే అవకాశాలున్నాయి.

వైసిపిలో నైరాశ్యం
వైసిపి శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయాయి. ఉదయం కౌంటింగ్ సెంటర్ల దగ్గర కనిపించిన వైసిపి నేతలు పది రౌండ్లు పూర్తయ్యేసరికి ఓటమి ఖాయమని భావించి వెనుదిరిగారు. శిల్పా మోహన్ రెడ్డి కూడా నిరాశతో కౌంటింగ్ సెంటర్ నుంచి నిష్క్రమించారు.

శిల్పా మోహన్ రెడ్డి ఇంటి పరిసరాల్లోను..
నంద్యాల అర్బన్‌లో శిల్పా మోహన్ రెడ్డి ఇంటి పరిసరాల్లోనూ టిడిపి ఆధిక్యం కనబర్చడం విశేషం. నంద్యాలలో తాను వెనుకంజలో ఉండటానికి శిల్పా మోహన్ రెడ్డి కొన్ని కారణాలను చెప్పుకొచ్చారు. టిడిపి డబ్బు వెదజల్లి నంద్యాలలో అనైతికంగా గెలిచిందన్నారు. పైగా ప్రచార సమయంలో తాను అనారోగ్యం పాలయ్యానని, ఓటర్లకు చేరువ కావడంలో కొంత వెనుకబడ్డానని.. అధి కూడా కొంత ప్రతికూలంగా మారిందన్నారు.

మెజార్టీ తగ్గదు
భూమా బ్రహ్మానంద రెడ్డి 20 వేల ఓట్లకు పైగా మెజారిటీలో కొనసాగుతున్న నేపథ్యంలో ఇంత ఆధిక్యం తగ్గడం సాధ్యం కాదని వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తానని, భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత ప్రజల్లో ఏర్పడిన సానుభూతి కూడా ఇంత మెజారిటీకి కారణమని తాను భావిస్తున్నట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications