వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాలలో టిడిపి-వైసిపిల కోసం చెన్నై టెక్కీలు!: రోజా నుంచి జగన్, బాబు దాకా ఇలా

నంద్యాల ఉపఎన్నికల నేపథ్యంలో టిడిపి, వైసిపిలు సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం నిర్వహించుకున్నాయి. ఉప ఎన్నికలను ఇరు పార్టీలు ఎంతో ప్రతిష్టగా తీసుకున్నాయి.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉపఎన్నికల నేపథ్యంలో టిడిపి, వైసిపిలు సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం నిర్వహించుకున్నాయి. ఉప ఎన్నికలను ఇరు పార్టీలు ఎంతో ప్రతిష్టగా తీసుకున్నాయి. ఓట్లు పొందేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని జార విడుచుకోలేదు.

చదవండి: నంద్యాలకు 'శిల్పా' బంపరాఫర్! శిల్పా మోహన్ రెడ్డి కోడలుకు నోటీసులు

ఉప ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం మరింత ఎక్కువైంది. ఎవరికివారు తమకు అనుకూల, వైరి పార్టీ వ్యతిరేక అంశాలతో సామాజిక మాధ్యమాలను హోరెత్తించారు.

ఐటీ నిపుణులను రప్పించి మరీ

ఐటీ నిపుణులను రప్పించి మరీ

టిడిపి, వైసిపి తరఫున ఈ ప్రచారానికి బృందాలు పని చేశాయి. నంద్యాల నియోజకవర్గంలోని ఓటర్ల ఫోను నంబర్లతో ప్రత్యేకంగా వాట్సప్‌ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఐటీ నిపుణులైన యువతను నంద్యాలకు రప్పించి, ప్రచారం కొనసాగించారు. ఒకరిపై మరొకరు ఫేస్‌బుక్‌, వాట్సప్‌ల్లో పోస్టింగ్‌లు పెడుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

Recommended Video

Nandyal By polls : Chandrabab Naidu Vs YS Jagan, What You Need to Know
ప్రచారం సమయంలో ఉన్నప్పటికీ

ప్రచారం సమయంలో ఉన్నప్పటికీ

ప్రచారం సమయంలో సోషల్ మీడియాలోను ప్రచారం నిర్వహించారు. కానీ ప్రచార సమయం ముగిసిన తర్వాత మరింత ఊపందుకుంది. ఆ తర్వాత యుద్ధాన్ని తలపించింది. ఓటర్ల ఫోన్‌లకు కుప్పలు తెప్పలుగా పోస్టింగ్‌లు వచ్చిపడ్డాయి.

సర్వేలు, విమర్శలు, ఆరోపణల హల్‌చల్

సర్వేలు, విమర్శలు, ఆరోపణల హల్‌చల్

ఏది నిజమో ఏది అబద్ధమో అర్థంకాని పరిస్థితి ఓటర్లకు ఏర్పడింది. సర్వేలు, విమర్శలు, ఆరోపణలు, ఇటీవల జరిగిన ప్రచారాల చిత్రాలు, వ్యాఖ్యలు హల్‌చల్‌ చేశాయి. కొన్ని చిత్రాలు, వ్యాఖ్యలతో పెడుతున్న పోస్టులు శ్రుతిమించాయి.

వేణు మాధవ్ వ్యాఖ్యలు హల్‌చల్

వేణు మాధవ్ వ్యాఖ్యలు హల్‌చల్

పెట్టారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో హాస్యనటుడు వేణుమాధవ్‌ జగన్‌పై చేసిన వ్యాఖ్యలు హల్‌చల్‌ చేశాయి. ఆయన బట్టేబాజ్ అని జగన్‌ను విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా వైసిపి తరఫున పోస్టులు పెట్టింది.

రోజా, ఉమ వ్యాఖ్యల పైనా

రోజా, ఉమ వ్యాఖ్యల పైనా

వైసిపి ఎమ్మెల్యే రోజా, టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ గుండుపై వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయి. ఎవరి సర్వేలు వారివిగా ఉన్నాయి. ఫలితాల తర్వాత టిడిపికి భారీ వలసలు ఉంటాయని ఒకరు పోస్ట్ పెడితే, వైసిపిలోకి ఉంటాయని మరికొందరు పెట్టారు.

జగన్, చంద్రబాబు సభలకు జనం తక్కువ అంటూ

జగన్, చంద్రబాబు సభలకు జనం తక్కువ అంటూ

నంద్యాలలో జగన్‌ సభకు తక్కువ జనాలు వచ్చారని టిడిపి అంటే, చంద్రబాబుకు తక్కువ మంది వచ్చారంటూ వైసిపి ఫోటోలు పెట్టింది. తమ అభ్యర్థులకు ఓటు వేయాలని ఇరు పార్టీలు ఫోన్లకు సందేశాలు పంపించాయి.

గెలుపు పైన

గెలుపు పైన

నంద్యాలలో గెలుపు ఎవరిది అంటూ మరికొందరు వీడియోలు పెట్టారు. సీఎం చంద్రబాబు ప్యాంట్రీ వ్యాన్‌ తనిఖీపై వాట్సప్‌ గ్రూపుల్లో వీడియోలు పంపించారు. అలాగే, చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలను కూడా పోస్ట్ చేశారు.

అఖిలప్రియపై రోజా

అఖిలప్రియపై రోజా

మంత్రి అఖిలప్రియపై రోజా చేసిన డ్రెస్సింగ్ వ్యాఖ్యలు, వారి మధ్య మాటల యుద్ధానికి సంబంధించిన పోస్టులు హల్‌చల్ సృష్టించాయి.

సోషల్ మీడియా కోసం వీరు

సోషల్ మీడియా కోసం వీరు

కాగా, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరుకు చెందిన వైసిపి, టిడిపి టెక్నికల్ బృందాలు ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ప్రచారం కోసం పని చేసాయి. ఒక్కో పార్టీ కోసం పదుల సంఖ్యలో ఐటీ యువత పని చేసింది.

English summary
Nandyal bypoll: Voting today began across 255 polling stations in Nandyal Assembly constituency in Kurnool district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X