వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాలకు 'శిల్పా' బంపరాఫర్! శిల్పా మోహన్ రెడ్డి కోడలుకు నోటీసులు

నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో శిల్పా సహకార మార్కెట్ బంపర్ ఆఫర్ ప్రకటించిందని వార్తలు వచ్చాయి.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో శిల్పా సహకార మార్కెట్ బంపర్ ఆఫర్ ప్రకటించిందని వార్తలు వచ్చాయి.

శిలువ వేసుకొని పీఠాధిపతులకు మ్రొక్కులా?: జగన్‌కు క్రిస్టియన్ల షాక్శిలువ వేసుకొని పీఠాధిపతులకు మ్రొక్కులా?: జగన్‌కు క్రిస్టియన్ల షాక్

శిల్పా కుటుంబం నిర్వహిస్తున్న శిల్పా సహకార మార్కెట్‌లో తక్కువ ధరకే స్థానికులకు సరుకులు పంపిణీ చేస్తామని ప్రకటించినట్లుగా చెబుతున్నారు.

తక్కువ ధరకే సరుకులు అని చెప్పడంతో

తక్కువ ధరకే సరుకులు అని చెప్పడంతో

తక్కువ ధరకే సరుకులు పంపిణీ చేస్తామని చెప్పడంతో పెద్ద ఎత్తున జనాలు మార్కెట్‌కు తరలి వచ్చారని, ఎక్కువ మంది రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుందని చెబుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు.

Recommended Video

Kakinada Municipal Corporation Elections : Chandrababu Naidu Strategy Planning
ఈసీ సోదాలు

ఈసీ సోదాలు

ఇదిలా ఉండగా, ఎన్నికల అధికారులు కూడా సోదాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ తక్కువ ధరలకే సరుకులు అందిస్తున్నారని అధికారులు నిర్ధారణకు వచ్చారని, దీంతో శిల్పా సహకార్ సిబ్బందిని బయటకు పంపించి, తాళాలు వేసినట్లుగా తెలుస్తోంది.

శిల్పా కోడలుకు నోటీసులు

శిల్పా కోడలుకు నోటీసులు

ఇదిలా ఉండగా, శిల్పా కుటుంబం ఆధ్వర్యంలో శిల్పా సహకార బ్యాంక్ నడుస్తోంది. ఈ బ్యాంక్ ద్వారా మహిళలకు డబ్బును పంచుతున్నారని, శిల్పా సూపర్ మార్కెట్ నుంచి ఉచితంగా సరుకులను పంపిణి చేస్తూన్నారంటూ అధికారులు శిల్పా సహకార బ్యాంక్ చైర్ పర్సన్ శిల్పా నాగిని రెడ్డికి (శిల్పా కోడలు) నోటీసులు అందాయి.

మూసివేత ఆదేశాలు, ఆ ప్రసక్తే లేదని నాగిని

మూసివేత ఆదేశాలు, ఆ ప్రసక్తే లేదని నాగిని

వెంటనే సహకార బ్యాంక్, సూపర్ మార్కెట్లను మూసివేయాలని నోటీసులో ఆదేశించారు. గత ఆరు రోజులుగా పోలీసులు, సిసి కెమెరాల పర్యవేక్షణలో బ్యాంకు, సూపర్ మార్కెట్ నడుస్తున్నాయని నాగిని రెడ్డి తెలిపారు. వీటిని మూసివేసే ప్రసక్తే లేదన్నారు.

శిల్పా అక్రమాలపై విచారణ చేపట్టాలి

శిల్పా అక్రమాలపై విచారణ చేపట్టాలి

శిల్పా మోహన్ రెడ్డి మార్కెట్‌ యార్డులో అక్రమంగా నిర్మించిన గోదాముపై విచారణ చేపట్టాలని ఎమ్మెల్సీ ఫరూక్ డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో శిల్పాకు ఓటమి తప్పదన్నారు. ఆయన అవినీతిలో ఎవరెస్టు శిఖరమంత ఎత్తుకు ఎదిగిపోయారన్నారు. 13 ఏళ్లు అధికారంలో ఉండి నంద్యాలకు ఏం చేశారని ఇప్పుడు మళ్లీ ఎన్నికల బరిలో ఉన్నారని ప్రజలు అడుగుతున్నారన్నారు.

చిన్నాన్నను గెలిపించుకోలేని జగన్, శిల్పాను గెలిపిస్తారా

చిన్నాన్నను గెలిపించుకోలేని జగన్, శిల్పాను గెలిపిస్తారా

వేటికి సమాధానం చెప్పకుండా, ఓటర్ల దగ్గరకు రాకుండా జగన్‌ గెలిపిస్తున్నారన్న నమ్మకంతో శిల్పా ఉన్నారని ఫరూక్ ఎద్దేవా చేశారు. శిల్పా అరాచకాలే భూమా బ్రహ్మానంద రెడ్డిని గెలిపిస్తాయన్నారు. సొంత జిల్లాలో సొంత చిన్నాన్నను గెలిపించుకోలేనని జగన్‌ నంద్యాలలో శిల్పాను ఎలా గెలిపిస్తారో ఆయనే చెప్పాలన్నారు.

భూమా నాగిరెడ్డి తర్వాత

భూమా నాగిరెడ్డి తర్వాత

భూమా నాగిరెడ్డి తరువాత ఆయన ఆశయాలు నేరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. నంద్యాలలో అభివృద్ధి జరుగుతుంటే వైసిపి నాయకులు ఎన్నికల కోసమే పనులు చేస్తున్నారని విమర్శించడం సరికాదన్నారు.

English summary
It is said that YSR Congress Party MLA candidate Silpa Mohan Reddy's Silpa society market gave offer to Nandyal people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X