పవన్ కల్యాణ్‌కు హ్యాండిచ్చిన కీలక నేత

సార్వత్రిక ఎన్నికల ముందు జనసేనకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని ఎదుర్కొనడానికి టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమి కట్టిన సంగతి అందరికి తెలిసిందే. అసలు కూటమి కార్యరూపం దాల్చడానికి ముఖ్య కారకుడే జనసేన అధినేత పవన్ కల్యాణ్. అయితే కూటమి ఏర్పడిన తరువాత ఆ పార్టీ నుంచే ఎక్కువ వ్యతిరేకతం వ్యక్తం కావడం గమనర్హం. 40 ఎమ్మెల్యే సీట్లు ఆశించిన జనసేన కార్యకర్తలకు భంగపాటు తప్పలేదు.

కేవలం 21 స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేయడంపై ఆ పార్టీ కార్యకర్తలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఈ 21 స్థానాల్లో కూడా వేరే పార్టీల నుంచి వారికి టికెట్లు కేటాయించడంపై జనసేనలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన పార్టీలో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. పవన్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ జనసేన నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు.

Nandyala Janasena leader Vishwanath ready to leave the party

ఇప్పటికే పరుచూరి భాస్కరరావు,పితాని బాలకృష్ణ , పోతిన మహేష్, శెట్టిబత్తుల రాజబాబు, మాకినీడి శేషుకుమారి వంటి నాయకులు జనసేనకు రాజీనామా చేశారు. తాజాగా మరో కీలక నేత జనసేనకు గుడ్ బై చెప్పడానికి సన్నద్ధం అవుతున్నారు. నంద్యాల జనసేన కోఆర్డినేటర్ విశ్వనాథ్ సైతంపార్టీని వీడటానికి సిద్ధమవుతున్నారు. గతంలో నంద్యాలలో పర్యటించిన సమయంలో ఇక్కడి సీటు విశ్వనాథ్‌కే కేటాయిస్తానని పవన్ హామీ ఇచ్చారు. పొత్తులో భాగంగా ఆ సీటు ఇప్పుడు టీడీపీకి ఖారారు కావడంతో .. విశ్వనాథ్‌‌కు మొండిచేయి ఎదురైంది.

టికెట్ దక్కక పోవడంతో విశ్వనాథ్‌ కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు విశ్వనాథ్ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. పవన్ కల్యాణ్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న విశ్వనాథ్‌తో వైసీపీ నేతలు చర్చలు జరిపారు. దీంతో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనను పార్టీలోకి శిల్పా మోహన్ రెడ్డి ఆహ్వానించనున్నారు. కాగా ఈ సమయంలో విశ్వనాథ్ వెంట భారీగా జనసేన నాయకులు కూడా వైసీపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+