సోనియాపై విమర్శలు ఖండించి తప్పు చేశా: నన్నపనేని
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఎవరైనా విమర్శలు చేస్తే గతంలో తాను ఖండించానని, ఇప్పుడు అందుకు లెంపలేసుకుంటున్నానని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు , ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి తెలిపారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇంతకాలం సోనియాపై వచ్చిన విమర్శలు ఖండించి పెద్ద తప్పే చేశానని అన్నారు.
సోనియా గాంధీ భారతదేశానికి వచ్చాకే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హత్యలు జరిగాయని, తోటి కోడలు మేనకా గాంధీని ఇంట్లో నుంచి వెళ్లగొట్టడానికి సోనియానే కారణమని గతంలో వచ్చిన విమర్శలను తాను నమ్మలేదని, ఆ విధంగా చేసి తాను చాలా పెద్ద తప్పు చేశానని తెలిపారు.

ప్రస్తుతం దేశం నాశనం కావడానికి సోనియా గాంధీనే కారణమని నన్నపనేని రాజకుమారి ఆరోపించారు. గాంధీ పేరును వాడేందుకు సోనియాకు అర్హత లేదని ఆమె అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుల సమాధుల వద్ద నివాళులర్పించే అర్హత కూడా సోనియాకు లేదని అన్నారు.
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు తీరుపై కూడా నన్నపనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, కేంద్రమంత్రులు చేతులు కాలాక ఆకులు పట్టుకుందాం అన్న చందంగా కూడా వ్యవహరించడం లేదని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications