ట్యాంక్‌బండ్ విగ్రహాలు: కెసిఆర్‌పై నన్నపనేని ఫైర్
విశాఖపట్నం/ విజయవాడ: ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖ నాయకుల విగ్రహాలను తొలగిస్తామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యాలు ఆత్మగౌరవానికి భంగం కలిగించేవిగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ కళావాణి ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్ర మహిళా ఉద్యోగుల సదస్సుకు హాజరైన ఆమె మీడియాతో మాట్లాడారు.
పనికిమాలిన విగ్రహాలంటూ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. శాంతి సందేశాన్ని ప్రపంచదేశాలకు అందించిన గౌతమ్‌బుద్ధుని విగ్రహాన్ని తొలగిస్తారా? శంషాదాబాద్ విమానాశ్రయాన్ని తొలగిస్తారా? అంటూ ఆవేశంగా ప్రశ్నించారు. సామరస్యంగా తలవంచుకుపోతుంటే ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు చట్టాలంటే గౌరవం లేదని, న్యాయస్థానాల పట్ల నమ్మకం లేదని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఉన్న తెలుగోళ్ల విగ్రహాలను తీసుకెళతారా, పీకేయమంటారా అని మాట్లాడడం విచారకరమన్నారు. ఈ విధానం సరైంది కాదన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో యావత్ తెలుగుజాతి గర్వించేలా తెలుగు జాతి అభ్యున్నతికి సర్వశక్తులు దారపోసిన, అలాగే దేశ విదేశాల్లో తెలుగు జాతి కీర్తిప్రతిష్ఠలను ఇనుమడించిన మహనీయుల విగ్రహాలను నాడు ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని కెసిఆర్ మరువరాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఓ పాకిస్తాన్‌లా ఆయన చూస్తున్నారంటూ మంత్రి మండిపడ్డారు.












Click it and Unblock the Notifications