కన్నీళ్లు ఆగలేదు: ఉదయ్ కిరణ్ మృతిపై నన్నపనేని

ఉదయ్ కిరణ్ మృతి పట్ల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఇలాంటి మరణాలు ఉండకూడదన్నారు. సినీ జీవితాల్లో అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటైందని, ఏది ఏమైనా బతికుండి సాధించుకోవాలని నన్నపనేని హితవు చేశారు.
రెండు కులాలు శాసిస్తున్నాయి
సినీ పరిశ్రమలో వర్ధమాన నటులు కనుమరుగు కావడానికి కులాధిపత్యమే కారణమని ఎపి బ్రాహ్మణ సేవా సంఘం ఆరోపించింది. తెలుగు సినీ పరిశ్రమను రెండు కులాలు శాసిస్తున్నాయని ద్రోణంరాజు రవికుమార్ ఆరోపించారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉదయ్ కిరణ్‌ను కొంతమంది తొక్కేశారని ఆరోపించారు.
కాగా, ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన శ్రీనగర్ కాలనీలోని స్వగృహంలో ఆదివారం అర్ధరాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గ మధ్యలో మృతి చెందారు. ఆయన నటించిన తొలి సినిమా 'చిత్రం'. దీనిని ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పైన ప్రముఖ దర్శకులు తేజ తెరకెక్కించారు.












Click it and Unblock the Notifications