48 గంటల దీక్ష, నిమ్స్‌కు నన్నపనేని (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర విభజనను నిరసిస్తూ 48 గంటల నిరాహార దీక్షకు కూర్చున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నన్నపనేని రాజకుమారి శాసనసభ ఆవరణలోని టిడిపిఎల్పి కార్యాలయం ఎదుట మంగళవారం సాయంత్రం నుంచి దీక్ష కొనసాగిస్తున్నారు.
బుధవారం నన్నపనేని రాజకుమారి బిపి లెవల్స్ తగ్గడంతో ఆందోళన వ్యక్తం చేసిన వైద్యులు, ఆమెను వెంటనే నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రాజకుమారికి ఆస్పత్రి వైద్యులు చికిత్స అందించారు. కాగా మంగళవారం దీక్ష చేపట్టిన నన్నపనేని రాజకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆమె ఇంటి వద్ద వదిలేశారు.
దీక్షను పోలీసులు భగ్నం చేసినా మళ్లీ బుధవారం ఉదయం టిడిఎల్పి కార్యాలయం ఎదుట దీక్షకు కూర్చున్నారు. రాష్ట్ర శాసనసభ, శాసన మండలి తిరస్కరించిన విభజన బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపి సీమాంధ్ర ప్రజల ఆశలపై నీళ్లు చల్లారని నన్నపనేని రాజకుమారి ఆరోపించారు.

వైద్య పరీక్షలు
రాష్ట్ర విభజనను నిరసిస్తూ 48 గంటల నిరాహార దీక్షకు కూర్చున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు.

సమైక్యాంధ్ర ప్లకార్డులు
రాష్ట్ర విభజనను నిరసిస్తూ 48 గంటల నిరాహార దీక్షకు కూర్చున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర టిడిపి నేతలు ప్లకార్లు ప్రదర్శించారు.

పొన్నాలతో..
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నన్నపనేని రాజకుమారి శాసనసభ ఆవరణలోని టిడిపిఎల్పి కార్యాలయం ఎదుట మంగళవారం సాయంత్రం నుంచి దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా అటువైపు వచ్చిన తెలంగాణ ప్రాంత మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతున్న నన్నపనేని.

ప్లకార్డులతోనే..
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నన్నపనేని రాజకుమారి శాసనసభ ఆవరణలోని టిడిపిఎల్పి కార్యాలయం ఎదుట మంగళవారం సాయంత్రం నుంచి దీక్ష కొనసాగించారు. అలసటకు గురికావడంతో ప్లకార్డులతోనే అక్కడే పడుకున్న నన్నపనేని.

దీక్ష చేస్తూ..
రాష్ట్ర విభజనను నిరసిస్తూ 48 గంటల నిరాహార దీక్షకు కూర్చున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు దీక్షలో కూర్చున్న రాజకుమారి.












Click it and Unblock the Notifications