చేతకానివాళ్లకు పెళ్లెందుకు: 'శాడిస్ట్ మొగుడు'పై నన్నపనేని, విచారణలో రాజేష్ ఆసక్తికర విషయాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

చిత్తూరు: పెళ్లైన తొలి రాత్రి భర్త రాజేష్ చేతిలో హింసకు గురైన శైలజ ఘటనపై నన్నపనేని రాజకుమారి స్పందించారు. శైలజపై దాడి ఘటన దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. రాజేష్ తండ్రి కూడా శైలజతో దారుణంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  Groom Beats Bride Mercilessly On First Night, Got Suspended

  రాజేష్ లాంటి చేతకాని వాళ్లు పెళ్లి చేసుకోకుండా ఉండాలని ఆమె మండిపడ్డారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలలోని లోపాన్ని దాచిపెట్టి అమ్మాయిల జీవితాలను నాశనం చేయవద్దని హితవు పలికారు. ప్రభుత్వంతో మాట్లాడి శైలజకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు.

  శాడిస్టు మొగుడు: ఆ రోజు శోభనం గదిలో ఏం జరిగింది?

  బాధితురాలిని పరామర్శించిన నన్నపనేని

  బాధితురాలిని పరామర్శించిన నన్నపనేని

  నన్నపనేని రాజకుమారి సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శైలజను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితురాలితో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బాధితురాలికి అండగా ఉండామని చెప్పారు.

  శాడిస్ట్ మొగుడిని సస్పెండ్ చేసిన డీఈవో: నా విషయం చెప్పొద్దని ఆ రాత్రి భార్యకు వేడుకోలు!

  విచారణలో రాజేష్ ఆసక్తికర విషయాలు

  విచారణలో రాజేష్ ఆసక్తికర విషయాలు

  ఇదిలా ఉండగా పోలీసుల విచారణలో రాజేష్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఆయనను పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. తనలోని లోపం గురించిన విషయాన్ని బయటకు చెప్పవద్దని భార్యను ఎంతగానో బతిమాలుకున్నా వినకపోవడంతోనే ఆగ్రహంతో క్రూరంగా ప్రవర్తించానని పోలీసుల ఎదుట రాజేష్ అంగీకరించాడని తెలుస్తోంది.

  స్వయంగా భార్యకు చెప్పా కానీ

  స్వయంగా భార్యకు చెప్పా కానీ


  విచారణలో భాగంగా కొన్ని కొత్త విషయాలను రాజేష్ చెప్పాడని తెలుస్తోంది. గదిలోకి వెళ్లిన తర్వాత తానే స్వయంగా తన విషయాన్ని చెప్పానని, ఇలా సంసారానికి పనికిరానివారు ఎంతో మంది పెళ్లి చేసుకుంటున్నారని గుర్తు చేస్తూ... పెళ్లి తనతో అయినా సంసారం మరెవరినైనా చూసుకోమని ఆఫర్ కూడా ఇచ్చానని చెప్పాడని తెలుస్తోంది.

  గుట్టుగా జీవితాన్ని నెట్టుకు రావాలనుకున్నా

  గుట్టుగా జీవితాన్ని నెట్టుకు రావాలనుకున్నా

  తన విషయం ఎవరికీ చెప్పవద్దని ప్రాధేయపడ్డానని, గుట్టుగా జీవితాన్ని నెట్టుకురావాలని భావించగా, తన భార్య ఆ విషయం బయటకు చెప్పడంతోనే క్రూరంగా మారిపోయానని రాజేష్ చెప్పాడని సమాచారం.

  శైలజ బయటకు రాకుంటే బాగా చూసుకునేవాడిని

  శైలజ బయటకు రాకుంటే బాగా చూసుకునేవాడిని

  దీంతో తాను మనోవేదనను అనుభవించానని, విషయం బయటకు రాకుండా ఉంటే శైలజను బాగా చూసుకునేవాడినని రాజేష్ పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా గాయాలతో ఆసుపత్రిలో ఉన్న శైలజ ప్రస్తుతం కోలుకుంటోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A young MBA graduate in Chittoor district had a bitter experience on her first night as her husband behaved sadistically with her on the first night. Nannapaneni Rajakumari visited hospital on Monday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి