జోగులాంబ ఆలయంలో నారా బ్రాహ్మణ ప్రత్యేక అభిషేకాలు (వీడియో)

జోగులాంబగద్వాల: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కోడలు, మాజీ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి మంగళవారం అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారిని, బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్నారు. బాల బ్రహ్మేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, అమ్మవారి ఆలయంలో అభిషేకాలు కుంకుమార్చనలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ ఈవో పురేందర్, ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆలయాల విశిష్ఠత గురించి అర్చకులు నారా బ్రాహ్మణికి వివరించారు.

Nara Brahmani visit Jogulamba temple, held special abhishekam

ఇది ఇలావుండగా, నారా బ్రాహ్మణి తెలుగుదేశం పార్టీ ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, బ్రాహ్మణి ఇప్పుడు పూర్తి హెరిటేజ్ బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. భువనేశ్వరితో కలిసి బిజినెస్ వ్యవహారాలు చూస్తున్నారు. ఈ సమయంలో బ్రాహ్మణి రాజకీయాల్లో పోటీకి ఆసక్తి చూపుతారా? అనే వాదన కూడా పార్టీలో ఉంది. అయితే, పార్టీలో బలమైన నాయకత్వం.. ఎన్టీఆర్ వారసుల బాధ్యతలు పెంచాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

Nara Brahmani visit Jogulamba temple, held special abhishekam

ఇందులో భాగంగానే బ్రాహ్మణి పేరు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. బ్రాహ్మణి ని విశాఖపత్నం లేదా విజయవాడ పార్లమెంట్ స్థానంలో పోటీ చేయించే అంశం పైన చర్చ జరుగుతున్నట్లు సమాచారం. విశాఖ నుంచి బాలయ్య అల్లుడు భరత్ సీటు ఆశిస్తున్నారు. కానీ, అక్కడ బ్రాహ్మణి పోటీ చేయటం ద్వారా విశాఖ పార్లమెంట్ తో పాటుగా ఉత్తరాంధ్రలోనూ సానుకూలత వస్తుందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+