మాన్సాస్ తీర్పు చీకటి జీవోలు జారీ చేస్తున్న జగన్ సర్కార్ కు చెంపపెట్టు : లోకేష్, అచ్చెన్న ధ్వజం
మాన్సాస్ , సింహాచలం ట్రస్ట్ చైర్ పర్సన్ గా సంచయిత గజపతిరాజు నియామకాన్ని రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనదైన శైలిలో స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన లోకేష్ ఏపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు.
Recommended Video

ధర్మం ,చట్టం , న్యాయానిదే అంతిమ విజయం : లోకేష్
మాన్సాస్ ట్రస్ట్ భూములను చెరబట్టేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టివేయడంతో ధర్మం ,చట్టం , న్యాయానిదే అంతిమ విజయమని తేలిందని నారా లోకేష్ పేర్కొన్నారు.ఈ తీర్పు అప్రజాస్వామికంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అర్ధరాత్రి చీకటి జీవోలు జారీ చేస్తున్న వైయస్ జగన్ సర్కార్ కు చెంపపెట్టు అని లోకేష్ వ్యాఖ్యానించారు. అంతేకాదు భూములు, వేల కోట్ల ఆస్తులు ప్రజల కోసం దానమిచ్చిన పూసపాటి వంశీకుల దానగుణానికి, సత్యనిష్ఠ కు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మరింత వన్నె తెచ్చిందని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.

అశోక్ గజపతిరాజు న్యాయ పోరాటం చేశారు
అరాచక ప్రభుత్వ పాలనపై, సింహాచల అప్పన్న ఆశీస్సులతో ప్రజాభిమానం , చట్టం,న్యాయం, రాజ్యాంగం సాధించిన విజయమిది అని పేర్కొన్నారు నారా లోకేష్. న్యాయ పోరాటం సాగించి విజయం సాధించిన అశోక్ గజపతి రాజు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ పేర్కొన్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన లోకేష్ ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని తన ట్వీట్ల ద్వారా స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ తీరును తాజా హైకోర్టు తీర్పుతో మరోమారు సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు.

జగన్ సర్కార్ కు ఈ తీర్పు చెంప పెట్టు : అచ్చెన్నాయుడు
మాన్సాస్ ట్రస్ట్ కేసు తీర్పుపై టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం స్పందించారు .హైకోర్టు తీర్పు జగన్ సర్కార్ కు చెంపపెట్టు అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఎన్నిసార్లు కోట్లతో తలదించుకునే పరిస్థితి లేదని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తే మొట్టికాయలు తప్పవంటూ జగన్ రెడ్డిని అచ్చం హెచ్చరించాడు. ట్రస్ట్ పరిధిలోని ఆస్తులను ,భూములను కాజేసేందుకు జగన్ పన్నిన కుట్రకు కోర్టు తీర్పు అడ్డుకట్ట వేసింది అన్నారు.












Click it and Unblock the Notifications