ఎన్టీఆర్‌ కౌంటర్..నారా లోకేష్ ఎన్‌కౌంటర్.. ఇది అసలు ఊహించలేదు బాసూ..!

గత కొంతకాలంగా నందమూరి కుటుంబంలో విభేదాలు చోటు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌, బాలకృష్ణల మధ్య మనస్పర్థలు తలెత్తుతున్నాయని పలు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హరికృష్ణ మరణం తర్వాత , నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఒంటరయ్యారు.ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్ట్‌పై నందమూరి కుటుంబం అంతా స్పందించినప్పటికీ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు మాత్రం ఈ ఘటనపై రియాక్ట్ కాలేదు.

అప్పటి నుంచి నారా, నందమూరి కుటుంబం ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లను దూరం పెడుతూ వస్తోంది.బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంపై సినీ ,రాజకీయ ప్రముఖులందరూ స్పందించారు. దీనిపై ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు సైతం రియాక్ట్ అయ్యారు.బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు రావడంతో నందమూరి, నారా కుటుంబాలు కలిసి సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. కానీ ఈ సెలబ్రేషన్స్‌కు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లకు ఆహ్వానం అందలేదు.

Nara Lokesh Backs Rajinikanth s Coolie Sparks Controversy by Ignoring NTR War 2

ఏం జరిగిందో తెలియదు కానీ ఎప్పుడు కామ్‌గా ఉండే ఎన్టీఆర్ సైతం 'వార్-2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాత నందమూరి తారకరామారావు ఆశీస్సులు తనపై ఉన్నంత కాలం నన్ను ఎవరూ టచ్ చేయలేరంటూ కౌంటరిచ్చారు. బాలకృష్ణను ఉద్దేశించే ఎన్టీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని మెజార్టీ నందమూరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ నటించిన 'వార్-2' సినిమాతో పాటే రజనీకాంత్ నటించిన 'కూలీ' సినిమా కూడా విడుదల అవుతోంది.

'కూలీ' సినిమాకు బెస్ట్ విషెష్ చెప్పిన మంత్రి నారా లోకేశ్ , ఎన్టీఆర్ 'వార్-2' సినిమాను లైట్ తీసుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. నారా లోకేష్ కావాలనే ఎన్టీఆర్ సినిమా పేరు చెప్పలేదని కొందరు వాదిస్తున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో రజనీకాంత్ వారి కుటుంబానికి అండగా ఉన్నారని ఆ కృతజ్క్షతతోనే నారా లోకేష్ కూలీ సినిమాకు మద్దతుగా నిలిచారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నారా లోకేష్ సపోర్టు 'కూలీ' సినిమాకే అని ఈ ఘటనతో తేలిపోయిందని మెజార్టీ అభిమానులు అభిప్రాయడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+