లోకేష్ బిజీబిజీ: పూర్తి బాధ్యతలు, పాలనపై బాబు దృష్టి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ క్రమంగా పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో పాలుపంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. అతను రోజు పార్టీ కార్యాలయానికి వచ్చి సమీక్షిస్తున్నారు. ఇప్పటికే ఆయన కార్యకర్తల సంక్షేమ నిధికి సమన్వయకర్తగా ఉన్నారు. త్వరలో ప్రారంభం కానున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ఆయనే పర్యవేక్షించనున్నారట.
ఇప్పటికే పార్టీ కార్యకలాపాలతో బీజీగా ఉన్న లోకేష్... క్రమంగా పూర్తి సమయం కేటాయించనున్నారు. లోకేష్ ప్రతి రోజు కార్యాలయానికి వస్తూ... కార్యకర్తలు, నాయకులతో మమేకమవుతున్నారు. సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరికైనా సాయం కావాల్సి వస్తే వెంటనే స్పందిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన వ్యవహారాల్లో బిజీగా ఉండగా.. లోకేష్ పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారట. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన నేతలు, కార్యకర్తలతో ఆయన నిత్యం మాట్లాడుతున్నారు. ఆయన దాదాపు రోజంతా కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు.












Click it and Unblock the Notifications