దమ్ముంటే నిరూపించు: జగన్‌కు లోకేష్ సవాల్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రి లోకేశ్ సవాలు విసిరారు. జగన్ తనపై చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాల్లో తన పాత్ర ఉందని చేసిన ఆరోపణలను
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రి లోకేశ్ సవాలు విసిరారు. జగన్ తనపై చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాల్లో తన పాత్ర ఉందని చేసిన ఆరోపణలను నిరూపించాలని లోకేశ్ సవాలు విసిరారు. 'నీలా నేర చరిత నాకు లేదు. నీలా రాష్ట్రాన్ని అమ్మేసే వాళ్లం కాదు' అంటూ ఘాటుగా స్పందించారు.
ఏర్పేడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన జగన్ మాట్లాడుతూ ఇసుక అక్రమ తవ్వకాల్లో లోకేశ్ పాత్ర ఉందని, నిందితులను రక్షించేందుకే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్ ఆరోపణలపై స్పందించిన మంత్రి లోకేశ్ తనపై జగన్ చేసిన ఆరోపణలను నిరూపించాలని ట్వీట్ చేశారు.

కాగా, చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద ఓ లారీ భీభత్సం సృస్టించిన ఘటనలో 15 మంది మరణించగా పలువురు గాయపడ్డ విషయం తెలిసిందే. ప్రమాదంలో గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications