జగన్ భద్రత ఎంతో తేల్చేసిన నారా లోకేష్..! 986పై సూటి ప్రశ్న..

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన భద్రతను గతంలో సీఎంగా ఉన్నప్పటి స్దాయికి పునరుద్ధరించాలని కోరుతూ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జగన్ భద్రతను ప్రభుత్వం తగ్గించిందా అన్న చర్చ మొదలైంది. గతంలో సీఎంగా ఉన్నప్పుడు జగన్ భద్రత ఎంత, ఇప్పుడు విపక్ష నేత కూడా కాని జగన్ భద్రత ఎంత అన్న అంశంపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే స్పందించగా.. ఇవాళ మంత్రి లోకేష్ కూడా ట్వీట్ చేశారు.

ప్రస్తుతం వైఎస్ జగన్ కు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత ఎంతో చెబుతూ మంత్రి నారా లోకేష్ ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో ఆయన.. ఇప్పుడు జగన్ కు ఉన్న భద్రత జెడ్ ప్లస్ అని తేల్చేశారు. జెడ్ ప్లస్ భద్రతతో పాటు 58 మంది సెక్యూరిటీ, రెండు ఎస్కార్ట్ బృందాలు, 10 మంది సాయుధ గార్డులతో భద్రత, కాన్వాయ్ లో రెండు అత్యాధునిక ల్యాండ్ క్రూయిజర్, బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉన్నట్లు నారా లోకేష్ తన ట్వీట్ లో తెలిపారు. ఇవి సరిపోక ఇంకా 986 మందితో భద్రత ఎందుకు అడుగుతున్నారంటూ నారా లోకేష్ వైఎస్ జగన్ ను సూటిగా ప్రశ్నించారు. జెడ్ ప్లస్ భద్రత సరిపోదా.. ఇంకా అభద్రత ఎందుకని నిలదీశారు.

nara Lokesh clarified to ys jagan security cut rumours ask z plus protection not enough

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జగన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై స్పందిస్తూ.. మాజీ సీఎంకు నిబంధనల ప్రకారమే భద్రత కల్పిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది. అలాగే జగన్ భద్రత విషయంలో అధికారుల కమిటీ రిపోర్టు మేరకే తాము వ్యవహరిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అలాగే ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఇదే విషయం స్పష్టం చేశారు. ఇవాళ మంత్రి నారా లోకేష్ మరో అడుగు ముందుకేసి జగన్ కు ప్రభుత్వం కల్పిస్తున్న వాస్తవ భద్రత ఎంతో చెప్పేశారు. ఇకనైనా జగన్ భద్రతపై వస్తున్న పుకార్లకు తెరపడుతుందో లేదో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+