ప్రత్యేక హోదా: జగన్‌కు లోకేష్ కౌంటర్, బాబు ఆస్తుల అంశంపై వైసిపికి రివర్స్

విజయవాడ/ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మంగళవారం నాడు స్పందించారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.

ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ఆర్థిక సాయం కూడా అవసరమన్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ కోసం ఆంధ్రప్రదశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. ధర్నాలు, ఆత్మహత్యలతో ప్రత్యేక హోదా రాదని గుర్తుంచుకోవాలని జగన్‌కు పరోక్షంగా చురకలు అంటించారు.

రాజకీయంగా తన ఉనికిని కాపాడుకునేందుకు కొందరు దీక్షల పేరుతో హడావుడి చేస్తున్నారని వైయస్ జగన్ మండిపడ్డారు. దీక్షలు, ధర్నాల పేరుతో ప్రజలలో విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు.

బాబుపై కేసులు ఎందుకు ఉపసంహరించుకున్నారు: పయ్యావుల

 Nara Lokesh counter to YS Jagan

చంద్రబాబు ఆస్తుల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు అవాస్తవాలు చెబుతున్నాయని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబు ఆస్తుల పైన గతంలో కేసులు వేసి, మధ్యలోనే జగన్ కుటుంబ సభ్యులు ఎందుకు ఉపసంహరించుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

జగన్ ఏ వ్యాపారం చేసి కోట్లు సంపాదించారో చెప్పాలన్నారు. బెంగళూరులోని 20 ఎకరాల ఆస్తి గురించి జగన్ ఎక్కడా ప్రకటించలేదన్నారు. జగన్ పేరుపై కార్లు ఉన్నా ఎన్నికల అఫిడవిట్లో చూపించలేదన్నారు. ఈ ఆస్తి తనది అని జగన్ చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసన్నారు.

చంద్రబాబు పైన ఎన్ని కేసులు వేసినా ఏం కాదన్నారు. జగన్ తన ఆస్తులను ప్రకటించాలని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పైన ఎన్నో కేసులు వేసి నిరూపించలేకపోతున్నారని మండిపడ్డారు. కాగా, చంద్రబాబు ఆస్తుల ప్రకటనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

అక్టోబరు 1న ఏపీ మంత్రివర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గం అక్టోబరు 1న సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అక్టోబరు 1న ఉదయం 10 గంటలకు విజయవాడలో మంత్రివర్గం సమావేశం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+