వచ్చాడు.. వెళ్లాడు: లోకేష్ కౌంటర్, 'జగన్ సత్తా 2019 తేలిపోతుంది'

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: తనను 'లోక్యాష్' అన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి నారా లోకేష్ మంగళవారం ధీటుగా సమాధానం చెప్పారు.

చదవండి: ఆంధ్రజ్యోతి కార్యాలయంలో పవన్ కళ్యాణ్

తాను తన పని తీరుతో విపక్షాలకు సమాధానం చెబుతానని వ్యాఖ్యానించారు. తనను తిట్టడానికే జగన్ గుంటూరులో రెండు రోజుల పాటు రైతు దీక్ష చేసినట్లుగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

అందుకే జనం రాలేదు

అందుకే జనం రాలేదు

జగన్ దీక్షలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదని నారా లోకేష్ అన్నారు. అందుకే ఆయన దీక్షకు రైతులు, ప్రజలు రాలేదని చెప్పారు. రాష్ట్రంలో తాగునీటి సమస్యను తాము చాలా వరకు తగ్గించామని చెప్పారు. 77 శాతం మంది ఈ విషయంలో సంతృప్తితో ఉన్నారని చెప్పారు.

జగన్ వచ్చాడు.. వెళ్లాడు

జగన్ వచ్చాడు.. వెళ్లాడు

తాము నెల రోజుల్లో 16 వందల మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించామని లోకేష్ చెప్పారు. జగన్ వచ్చాడని, పోయాడని, దీక్షకు మాత్రం జనం రాలేదన్నారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

జగన్ నాటకాలు.. డొక్కా

జగన్ నాటకాలు.. డొక్కా

జగన్ దీక్షపై అంతకుముందు పలువురు మంత్రులు, టిడిపి నేతలు కూడా విమర్శలు గుప్పించారు. జగన్ ఎగిరిపడే విస్తరాకులాంటి వాడని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. రైతు దీక్ష పేరుతో జగన్ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

ప్రధాని పదవా..

ప్రధాని పదవా..

దీక్ష వేదికపై నేతల ప్రసంగాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని డొక్కా అన్నారు. రైతు దీక్షలో రైతుల గురించి ఒక్కరు కూడా మాట్లాడలేదన్నారు. సీఎం సీటుకే దిక్కు లేదు గానీ, ప్రధాని పదవి చేపడతామనడం విడ్డూరమన్నారు.

యోగి ఆదిత్యనాథ్ ఏపీని చూసి..

యోగి ఆదిత్యనాథ్ ఏపీని చూసి..

రుణమాఫీ విషయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏపీని ఆదర్శంగా తీసుకున్నారని డొక్కా అన్నారు. నారా లోకేష్ వడ్డించిన విస్తరు లాంటి వ్యక్తి అని, ఎగిరిపడే విస్తరాకు లాంటి వాడు జగన్ అన్నారు. ఏ అర్హత లేని జగన్ సీఎం సీటు కోసం ఆరాటపడుతుంటే అన్ని అర్హతలున్న లోకేష్ పదవులు పొందడంలో తప్పు లేదన్నారు. 2019లో జగన్ సత్తా ఏమిటో తేలిపోతుందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister and TDP leader Nara Lokesh on Tuesday lashed out at YSR Congress party chieff YS Jaganmohan Reddy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి