గేరు మార్చిన లోకేష్-పప్పు నుంచి దుమ్మురేపే స్ధాయికి- చంద్రబాబు నీడ నుంచి బయటికి

ఏపీలో ఒకప్పుడు పప్పు అనే పేరును వైసీపీ విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చిన తర్వాత టీడీపీ నేత నారా లోకేష్ ప్రత్యర్ధులంతా దీన్ని వాడుకోవడం మొదలుపెట్టారు. చివరికి గూగుల్ లోసైతం పప్పు అని కొడితే లోకేష్ ఫొటో కనిపించేంతగా ఈ పేరు ప్రచారంలోకి వచ్చేసింది. అప్పట్లో టీడీపీ అధినేత, తన తండ్రి చంద్రబాబు నీడలో ఉంటూ దొడ్డి దారిన ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి తెచ్చుకున్నాడంటూ ప్రత్యర్ధులు విమర్శించిన నారా లోకేష్ ను ఇప్పుడు అదే స్ధాయిలో విమర్శించేందుకు వారు జంకుతున్నారు. దీనికి ప్రధాన కారణం నిత్యం జనంలో ఉంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడమే.

 నారా లోకేష్ ప్రస్ధానం

నారా లోకేష్ ప్రస్ధానం

టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడిగా తెలుగుదేశంతో పాటు ఏపీ రాజకీయాలకు పరిచయమైన నారా లోకేష్ ఏపీలో చాలా మంది రాజకీయ నేతలకు భిన్నంగా విదేశీ చదువులు చదువుకున్నారు. ఏపీలో చంద్రబాబు వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా రాజకీయాలు చేస్తున్న తరుణంలో లోకేష్ విదేశాల్లో చదువుకుంటున్నారు. ఆ తర్వాత టీడీపీ విపక్షంలోకి వచ్చిన సమయంలోనూ ఆయన పెద్దగా కనిపించలేదు. ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక లోకేష్ పేరు వినిపించడం మొదలైంది. రాజకీయాల్లోకి వచ్చిన అనతికాలంలోనే తండ్రి చలవతో ఆయన ఎమ్మెల్సీగా ఎంపికై మంత్రి పదవి చేపట్టారు. వచ్చీ రాగానే ఐటీ మంత్రి పదవి చేపట్టడం ద్వారా టీడీపీ రాజకీయాల్లో సంచలనం రేపారు. ఆ తర్వాత టీడీపీ అధికారం కోల్పోవడంతో విపక్షంలో ఉంటూ సొంత పార్టీ టీడీపీని నడిపిస్తున్నారు.

 మంత్రిగా నారా లోకేష్

మంత్రిగా నారా లోకేష్

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ అయి ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్... అంతగా అనుభవం లేకపోయినా ప్రభుత్వంలో తనదైన ముద్ర వేసుకున్నారు. సాక్ష్యాత్తూ సీఎం తనయుడు కావడంతో మిగతా మంత్రులతో పాటు ప్రభుత్వంలో అధికార గణం కూడా ఎప్పుడూ లోకేష్ చుట్టూనే ఉండేది. ఐటీ మంత్రిగా పలు కొత్త సంస్ధల్ని రాష్ట్రానికి రప్పించేందుకు ప్రయత్నించినా అమరావతి నిర్మాణం పూర్తికాకపోవడం, విశాఖలో కంపెనీలు పెట్టేందుకు సంస్ధలు ఆసక్తి చూపడంతో లోకేష్ ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదు. అయినా మంగళగిరిలో పలు ఐటీ సంస్ధల్ని తీసుకురావడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో పార్టీ వ్యవహారాలపైనా తనదైన ముద్ర వేసేందుకు లోకేష్ ప్రయత్నించారు.

 మంగళగిరిలో ఓటమితో

మంగళగిరిలో ఓటమితో

భారీ అంచనాల మధ్య 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే దానిపై పలు కసరత్తులు చేసిన టీడీపీ చివరికి లోకేష్ ను గుంటుూరు జిల్లా మంగళగిరి నుంచి బరిలోకి దింపింది. తొలిసారిగా ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన లోకేష్.. వైసీపీ గాలిలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. మంగళగిరిలో తాను అభివృద్ధి చేసిన ఐటీ సంస్ధలు ఉండటం, రాజధాని పరిధిలోకి వచ్చే ప్రాంతం కావడంతో తనకు ఎదురు ఉండదని భావించినా వైసీపీ హవా ముందు అవేవీ పనికి రాలేదు. దీంతో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన లోకేష్ కు ఓటమి ఎదురైంది. అప్పటికే ఎమ్మెల్సీగా ఉండటంతో లోకేష్ కు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు.

 వైసీపీతో సై అంటే సై

వైసీపీతో సై అంటే సై

టీడీపీ ఓటమిపాలై వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చీ రావడంతోనే సీఎం జగన్ చంద్రబాబు ముచ్చటపడి కట్టించుకున్న ప్రజావేదికను కూల్చేయడంతో నారా లోకేష్ పోరు మొదలైంది. ఆ తర్వాత వైసీపీ సర్కార్ పై వరుసగా పోరాటాలు చేస్తూ వస్తున్న నారా లోకేష్.. మరోవైపు పార్టీ శ్రేణులకు అండగా నిలవాల్సిన పరిస్దితి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం వరుసగా కేసులు పెడుతున్న నేపథ్యంలో వారిని నడిపించడం అంత సులువు కాదు. వారిని తన పోరాటాల్లో భాగస్వాముల్ని చేయడం సాధ్యం కాదు. అయినా మొండి పట్టుదలతో లోకేష్ పోరాటాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో పలుమార్లు జైలుపాలైన టీడీపీ నేతల్ని పరామర్శించడంతో పాటు వారి కోసం జైలు వద్ద వేచి చూసిన సందర్భాలూ లేకపోలేదు. అలా రాటు దేలిన లోకేష్.. ఇప్పుడు వైసీపీ నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేయడంలో బిజీగా కనిపిస్తున్నారు.

 జూనియర్ తో గట్టి పోటీ ఎదుర్కొంటూ

జూనియర్ తో గట్టి పోటీ ఎదుర్కొంటూ

చంద్రబాబు తర్వాత టీడీపీ పగ్గాలు ఎవరు అందుకోవాలనే విషయంలో పరిస్ధితులు తనకే అనుకూలంగా ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం, తాజాగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఓటముల తర్వాత లోకేష్ పైనా ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా పార్టీ శ్రేణులు చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపాలంటూ చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇది పరోక్షంగా లోకేష్ పైనా ఒత్తిడి పెంచుతోంది. అలాగని ఎన్టీఆర్ ను రంగంలోకి దించితే తన వాగ్దాటితో అనతికాలంలోనే టీడీపీని ఆక్రమించడం ఖాయం. అందుకే చంద్రబాబు ఆయన్ను దూరంగా పెడుతున్నారనే ప్రచారం కూడా ఉంది. ఇలాంటి పరిస్ధితుల్లో లోకేష్ తప్పనిసరిగా రాణించాల్సిన పరిస్దితి ఎదురవుతోంది.

 గేరు మార్చిన లోకేష్

గేరు మార్చిన లోకేష్

ఓవైపు వైసీపీ సర్కార్ పై పోరుకు టీడీపీ శ్రేణులు కేసుల భయంతో వెనుకాడుతుండటం, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపాలని పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి తండ్రి చంద్రబాబుపై పెరుగుతున్న ఒత్తిడి.. ఇలా పలు అంశాలు లోకేష్ పై ఒత్తిడి అమాంతం పెంచేస్తున్నాయి. దీంతో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్ధితుల్లో లోకేష్ గేరు మారుస్తున్నారు. వైసీపీ మంత్రులపై, సీఎం జగన్ పై ఎప్పటికప్పుడు విమర్శలు ఎక్కుపెడుతూ ఊపిరి సలపనీయకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ తనవే అన్నట్లుగా ఎక్కడ సమస్య ఉందని తెలిస్తే అక్కడ వాలిపోతున్నారు లోకేష్. గతంలో పార్టీని నడిపించడం కంటే తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన అధికారాన్ని అనుభవించడంపేనే దృష్టిపెట్టిన లోకేష్.. ఇప్పుడు వైసీపీపై పోరాడితే తప్ప తనకు ఆ అధికారం దక్కదన్న అంచనాకు వచ్చేసినట్లే కనిపిస్తున్నారు. దీంతో వైసీపీని అడుగడుగునా టార్గెట్ చేస్తూ కేసుల్ని కూడా లెక్కచేయకుండా దూసుకెళ్తున్నారు.

 చంద్రబాబు నీడ నుంచి బయటికి

చంద్రబాబు నీడ నుంచి బయటికి

ఇన్నాళ్లూ తండ్రి చంద్రబాబు నీడలోనే ఉండిపోయిన లోకేష్.. వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. లోకేష్ ను విమర్శించాలనుకునే వారంతా కచ్చితంగా చంద్రబాబు ప్రస్తావన కూడా తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. లోకేష్ ను నేరుగా విమర్శిస్తూ మంత్రులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అలాగే పార్టీ వ్యవహారాల్లో సైతం లోకేష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో టికెట్ కావాల్సిన వారంతా లోకేష్ ను ప్రసన్నం చేసుకునేందుకు క్యూ కడుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా.. ఆయనకు చెప్పకుండా కీలక నిర్ణయాలు తీసుకోని లోకేష్.. ఇప్పుడు విపక్షం చేస్తున్న పోరాటాల్లో మాత్రం తానే స్వయంగా దూసుకెళ్తున్నారు. సీఎం జగన్ తో పాటు వైసీపీ మంత్రుల్ని టార్గెట్ చేస్తూ ఆయన చేసే పోరాటాల్లో చంద్రబాబు పాత్ర నామమాత్రంగా మారిపోయింది. దీంతో చంద్రబాబు నీడ నుంచి లోకేష్ బయటికి వచ్చేశారనే ప్రచారం జరుగుతోంది.

Recommended Video

    Ys Jagan : గాంధీ జయంతి రోజునే సంచలనం.. ఇక ప్రజల్లోనే | Ys Jagan Cares || Oneindia Telugu
     లోకేష్ పప్పు కాదని వైసీపీకీ అర్ధమైందా ?

    లోకేష్ పప్పు కాదని వైసీపీకీ అర్ధమైందా ?

    గతంలో లోకేష్ చేసే విమర్శల్ని కానీ, పోరాటాల్ని కానీ సీరియస్ గా తీసుకునేందుకు వైసీపీ ఆసక్తి చూపించేది కాదు. విపక్షంలో ఉండగా మంత్రి అయిన లోకేష్ ను ప్రజల్లో పలుచన చేసేందుకు ప్రయత్నించిన వైసీపీ.. ఓసారి అధికారంలోకి వచ్చాక మాత్రం లోకేష్ ను లైట్ తీసుకుంది. కానీ లోకేష్ వరుస దాడులతో ఇప్పుడు వైసీపీ మంత్రులు ప్రతీసారీ రంగంలోకి దిగి కౌంటర్లు ఇచ్చుకోవాల్సిన పరిస్దితి. అలా చూసినా లోకేష్ పై అవినీతి మరకలు లేకపోవడం, టార్గెట్ చేసేందుకు పదునైన అస్త్రాలు లేకపోవడంతో పాత విమర్శలతోనే లోకేష్ ను మంత్రులు వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇదే పరిస్ధితి కొనసాగితే భవిష్యత్తులో చంద్రబాబు కంటే లోకేష్ ను ఎదుర్కొనేందుకే వైసీపీ సర్కార్ శ్రమించాల్సిన పరిస్ధితులు వచ్చినా ఆశ్చర్యం లేదని అనుకోవచ్చు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+