Video: జంతర్ మంతర్ లో మిన్నంటిన సంబరాలు- నీట్ మృతులకు నివాళి..!
నీట్ సహా జాతీయ పోటీ పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం నెల రోజులుగా ఢిల్లీలో ఆందోళనలు నిర్వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ(CJP), విద్యార్ధులు ఎట్టకేలకు తమ పంతం నెరవేర్చుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో మూడో విడత చర్చలకు ముందే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమాచారం అందుకున్న సీజేపీ ప్రతినిధులు జంతర్ మంతర్ లో విద్యార్ధులను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు.
వాస్తవానికి నిన్న రాత్రి ప్రధాని మోడీ ఆధ్వర్యంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ .. మంత్రుల రాజీనామాలు అక్కర్లేదంటూ తేల్చేసింది. అనంతరం ప్రధాని మోడీ విద్యార్దులు కేంద్రం చర్యలతో సంతోషంగా ఉన్నారంటూ అర్ధరాత్రి మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. దీంతో విద్యార్దులు ఇవాళ తమ ఆందోళనల్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటన వెలువడటంతో జంతర్ మంతర్ లో విద్యార్ధుల సంబరాలు మిన్నంటాయి. ముందుగా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్ధాపకుడు అభిజిత్ దిప్కే.. తనకు వచ్చిన ఫోన్ కాల్ ను స్టేజ్ మీదే మాట్లాడి ఈ విషయాన్ని మైక్ లో ప్రకటించారు. దీంతో విద్యార్ధులు సంబరాల్లో మునిగిపోయారు.

DEMOCRACY WINS! 🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/HpCaqBkPxc
— Cockroach is Back (@Cockroachisback) July 25, 2026
This is democracy. He has resigned. We have two more demands. We won't go like this.
— Cockroach is Back (@Cockroachisback) July 25, 2026
Dharmendra Pradhan has resigned. But the families of the children who committed suicide should receive compensation of one crore rupees. They should get it.
One crore rupees compensation to all… pic.twitter.com/CyhfGDUola
జంతర్ మంతర్ లో నెల రోజులుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనే ప్రధాన డిమాండ్ తో ఎన్నో నిరసనలు చేస్తూ, మధ్యలో పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసుల దెబ్బలు తిని గాయాల పాలయ్యారు. ఇవాళ ప్రధాన్ రాజీనామా చేసినట్లు తెలియడంతతో సీజేపీ ప్రతినిధులతో కలిసి వారు సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో జంతర్ మంతర్ లో ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంత స్ధాయిలో వాతావారణం పూర్తిగా మారిపోయింది. విద్యార్ధులు భావోద్వేగంతో పరస్పరం హత్తుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. మరోవైపు నీట్ పేపర్ లీక్ కారణంగా చనిపోయిన విద్యార్దుల చిత్రపటాలున్న పోస్టర్ ను స్టేజ్ మీదకు తీసుకొచ్చిన విద్యార్ధులు.. వారికి పేరు పేరునా నివాళులు అర్పిస్తున్నారు.
#WATCH | Chennai, Tamil Nadu: Protesters celebrate after the resignation of Union Education Minister Dharmendra Pradhan. pic.twitter.com/6QBryy8UUh
— ANI (@ANI) July 25, 2026
మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనాామా విషయం తెలియగానే దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్న విద్యార్దులు కాస్తా సంబరాలు చేేసుకుంటున్నారు. చెన్నై, ముంబైతో పాటు పలు నగరాల్లో విద్యార్ధుల సంబరాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్నాళ్ల తమ పోరాటం ఫలించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని విద్యార్ధులు తమ విజయంగా అభివర్ణిస్తూ హల్ చల్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications