జగన్ మెంటల్ మామ .. పరీక్షల కారణంగా ఏ విద్యార్థి ప్రాణానికి ముప్పు వాటిల్లినా సీఎం దే బాధ్యత : లోకేష్ ధ్వజం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో పరీక్షలు రద్దు చేయని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేనని ఆయన పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ విద్యార్థుల ప్రాణాలు కాపాడటం కోసమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తుందని లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఎస్‌సి, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలన్న తన డిమాండ్‌ను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం పునరుద్ఘాటించారు.

పరీక్షలు జరిగితే లక్షలాది మంది విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన, ఐదు లక్షల మంది విద్యార్థుల అభిప్రాయాలను పొందిన తరువాత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ బిస్వ భూషన్ హరిచందన్ లకు లేఖలు రాసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. 12 వ తరగతి సిబిఎస్‌ఇ పరీక్షలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత మెజారిటీ రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయని, అయినప్పటికీ ఏపీ సీఎం పరీక్షలను రద్దు చేయలేదని లోకేష్ విమర్శించారు. పరీక్షలు జరిగితే లక్షలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం పరీక్షలు రద్దు చేస్తే తన లేఖలు వెనక్కి తీసుకుంటానన్న లోకేష్
పరీక్షలు నిర్వహిస్తే లక్షల మంది ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ద్వారా తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన లోకేష్, ప్రభుత్వం పరీక్షలు రద్దు చేస్తే, జగన్ సర్కార్ కు తాను రాసిన ప్రతి ఒక లేఖను వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.
జగన్ మొండి వైఖరితో పరీక్షల నిర్వహణ చేస్తే అది ఒక సూపర్ స్ప్రెడర్ కార్యక్రమం అవుతుందని విమర్శించారు లోకేష్.

ఏ విద్యార్థి ప్రాణానికి ముప్పు వాటిల్లినా సీఎం జగన్ దే బాధ్యత
విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపి వారి ఆందోళన దృష్ట్యా అయినా పరీక్షలు రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏ విద్యార్థి ప్రాణానికి ముప్పు వాటిల్లినా సీఎం జగన్ దే బాధ్యత అని, దానిని ప్రభుత్వ హత్యగానే పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించిన లోకేష్ పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకోకుంటే మరింత ఉద్యమిస్తామంటూ తేల్చి చెప్పారు. జగన్ మెంటల్ మామని, పరీక్షలు ముద్దు, ప్రాణాలు వద్దు అంటున్నారని విమర్శించారు.

పరీక్షలను రద్దు చేయడానికి సీఎంకు మనసు రావడం లేదు
హైకోర్టు , సుప్రీంకోర్టు చెప్పినా పరీక్షలను రద్దు చేయడానికి సీఎంకు మనసు రావడం లేదని మండిపడిన లోకేష్ కోవిడ్ మూడవ దశ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న సమయంలో పరీక్షలు రాసేందుకు విద్యార్థులు బయటకు వస్తే పరిస్థితి ఏమిటని లోకేష్ ప్రశ్నించారు. విద్యార్థులు , తల్లిదండ్రులు ఇంటర్, ఎంసెట్ పరీక్షలన్నీ ఆగస్టు నెలలో నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడంతో దేనికి ప్రిపేర్ అవ్వాలో అర్థం కాక మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని లోకేష్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ మొండితనంతో 15 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం తగదన్నారు లోకేష్.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications