అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీని బీహార్‌లా మార్చేసిన జగన్ , కక్షా రాజకీయాలతో ఏది సాధించినా తాత్కాలికమే: నారా లోకేష్‌ ఫైర్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీని జగన్ బీహార్ లా మార్చేశారని, గన్నులు పట్టుకుని వైసిపి మాఫియా ప్రజలపై పడ్డారని నారా లోకేష్ విమర్శించారు. వైయస్ జగన్ ని గెలిపించడానికి కొంతమంది పోలీసులు పూర్తిగా దిగజారి వ్యవస్థకు కళంకం తెస్తున్నారని లోకేష్ మండిపడ్డారు .వైసిపి ఇసుక మాఫియా గన్నులతో రెచ్చిపోతుంది నిప్పులు చెరిగారు.

ప్రశ్నిస్తే చంపేసే నయా నియంత జగన్ రెడ్డి : జనసేన కార్యకర్త వెంగయ్య మృతిపై లోకేష్ వ్యాఖ్యలు ప్రశ్నిస్తే చంపేసే నయా నియంత జగన్ రెడ్డి : జనసేన కార్యకర్త వెంగయ్య మృతిపై లోకేష్ వ్యాఖ్యలు

పచ్చని సీమగా ఉన్న ప్రాంతాన్ని నేడు ఫ్యాక్షన్ సీమగా చేశారని ఫైర్

పచ్చని సీమగా ఉన్న ప్రాంతాన్ని నేడు ఫ్యాక్షన్ సీమగా చేశారని ఫైర్

మహాత్మాగాంధీ వర్ధంతిని తన రాజకీయ విమర్శలకు వాడుకున్నారు నారా లోకేష్. రాజకీయ ఉద్యమాలలో అహింస సత్యాలను మొదటిసారిగా ఆచరించి విజయం సాధించిన మహనీయుడు గాంధీజీ .ఆయన సంస్కరించిన ఈ సమాజంలో ఇంత కక్ష రాజకీయాలకు నమ్ముకున్న వారు ఏది సాధించినా అది తాత్కాలికమే, అంతిమ విజయం సత్యానిదే అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ను బీహార్ లా మార్చేశారు అంటూ విమర్శించిన నారా లోకేష్, నాడు నేడు లో భాగంగా పచ్చని సీమగా ఉన్న ప్రాంతాన్ని నేడు ఫ్యాక్షన్ సీమగా చేశారు అంటూ నిప్పులు చెరిగారు.

జగన్ కంటే ముందే ఆయన పెంచి పోషిస్తున్న ఇసుక మాఫియా గన్ లతో దాడి

జగన్ కంటే ముందే ఆయన పెంచి పోషిస్తున్న ఇసుక మాఫియా గన్ లతో దాడి

గన్ రాకముందే జగన్ వస్తాడని గాలి కబుర్లు చెప్పారని, ఇప్పుడు జగన్ కంటే ముందే ఆయన పెంచి పోషిస్తున్న ఇసుక మాఫియా గన్ లతో వచ్చి జిల్లాలో రెచ్చి పోతోందని మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా లంకల గన్నవరం లో భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారని, ఇసుకని బంగారం చేసి గన్నులు పట్టుకుని ప్రజలపై పడ్డారు వైసీపీ ఇసుకాసురులు అంటూ లోకేష్ నిప్పులు చెరిగారు. మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి లేకుంటే వారు ఎంతకైనా తెగిస్తారు . ప్రాణాలు తీస్తారు అంటూ వ్యాఖ్యానించారు.

పంచాయతీ ఎన్నికల విషయంలో సోషల్ మీడియాలో వైసీపీపై దాడి

పంచాయతీ ఎన్నికల విషయంలో సోషల్ మీడియాలో వైసీపీపై దాడి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేసిన నారా లోకేష్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల విషయంలో జరుగుతున్న అనేక సంఘటనలను సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలలో పార్టీలకతీతంగా జరిగే ఎన్నికలకు మేనిఫెస్టో ఏంటని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని పేర్కొన్న లోకేష్ వాళ్లు అధికారంలోకి వచ్చే నెలలో పల్లెల అభివృద్ధికి ఏ ప్రణాళిక తీసుకురాలేకపోయారు అంటూ ఎద్దేవా చేశారు.

పలు సంఘటనల ఆడియోలు , వీడియోలు షేర్

పలు సంఘటనల ఆడియోలు , వీడియోలు షేర్


చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం, ఆర్ కే వివి పేట పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాంబశివరావు ఆచారి బంధువులను వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడిన అన్యాయం అంటూ ఆ ఆడియో లింక్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు నారా లోకేష్.

అంతేకాదు వైయస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడంకోసం పోలీసులు కూడా రంగంలోకి దిగారని పూర్తిగా దిగజారి పోలీసు వ్యవస్థకే కళంకం తెస్తున్నారు . కొంతమంది పోలీసులు, శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులకు రాజకీయాలతో పని ఏంటి అంటూ ఓ పోలీసు అధికారి మాట్లాడుతున్న వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. గుంటూరు జిల్లా పేటేరు గ్రామంలో పోలీసులు ఏకగ్రీవం చేయాలంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగడం రాజారెడ్డి రాజ్యాంగానికి పరాకాష్ఠ అంటూ మండిపడ్డారు లోకేష్.

English summary
Nara Lokesh has been criticized for targeting Jagan. Criticizing Jagan for turning Andhra Pradesh into Bihar, Nara Lokesh lashed out at the faction for turning what was once a green frontier into a factional frontier today. Rumor has it that Jagan will arrive before the gun arrives. Now in the reverse he has come up with the sand mafia guns was raising before Jagan Reddy and is incensed that ycp mafia is attacking people in the district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X