తిన్నది కక్కిస్తాం: జగన్‌పై లోకేష్, టిలో బాబుపై షర్మిల

గుంటూరు/ఖమ్మం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఆదివారం విరుచుకుపడ్డారు. ఒక వ్యక్తి లక్ష కోట్లు దోచుకుంటారని ఎవరైనా ఊహించారా? ఆ డబ్బు కక్కిస్తే రైతు రుణాల మాఫీ అసాధ్యమేమి కా'దని అన్నారు. రైతులకు 65 వేల కోట్ల రుణాలు మాఫీ చేయడం అసాధ్యం అంటున్న వారికి, అదెలా సాధ్యమో టిడిపి అధికారంలోకి వచ్చి చూపిస్తుందన్నారు.

ఆదివారం గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలలో లోకేష్ యువ ప్రభంజనం సాగింది. తెనాలి సభలో మాట్లాడుతూ.. ఈ ప్రభంజనం చూస్తుంటే ఫ్యాన్ రెక్కలు విరిగి గాలికి కొట్టుకుపోవడం ఖాయమనిపిస్తున్నదన్నారు. రాష్ట్రాన్ని పదేళ్లలో చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేయగా, ఆ తర్వాత వచ్చిన వారు అందిన కాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అవినీతికి పాల్పడి 16 నెలలు జైలులో ఉండి వచ్చిన వారు రాష్ట్రాన్ని ఉద్దరిస్తామంటే ఎవరైనా నమ్ముతారా? అన్నారు.

Nara Lokesh in Guntur, Sharmila in Khammam

వారు నాలుగే నాలుగు సంతకాలతో ప్రజల జీవితాలను మార్చేస్తామంటున్నారు. కాని ఆ తర్వాత లక్ష సంతకాలు ఆయన కోసం, ఆయన కుటుంబ సభ్యుల కోసం చేస్తారని జగన్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల నిర్మాణానికి వందల ఏళ్లు పట్టగా, సైబరాబాద్‌ను చంద్రబాబు పదేళ్లలో నిర్మించి చూపించారని గుర్తుచేశారు. దీని వల్ల ఐటి, ఫార్మా రంగాలు అభివృద్ధి చెంది అయిదు లక్షల మందికి ఉద్యోగాలు, మరో 15 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు.

ఇదే తరహాలో సీమాంధ్రను అభివృద్ధి చేయగల శక్తి చంద్రబాబుకు మాత్రమే ఉందని చెప్పారు. "సీమాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పది సైబరాబాద్‌లు రావాలి. ఆ పని చంద్రబాబు వల్లే సాధ్యమన్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, పదేళ్ల పరిపాలన అనుభవం ఆయన సొంతం. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తే అవినీతిని పారదోలి అభివృద్ధి తీసుకు వస్తారన్నారు.

ఖమ్మంలో షర్మిల

వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, వైయస్ కుటుంబానికి తెలంగాణ, సీమాంధ్ర.. రెండు ప్రాంతాలు రెండు కళ్లని ఆ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. ఖమ్మం జిల్లాలో ఆదివారం ఆమె ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కూసుమంచి సభలో షర్మిల ప్రసంగిస్తూ వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. చంద్రబాబు హయాంలో తెలంగాణలో అభివృద్ధి జరగలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు ఆల్‌ఫ్రీ అంటున్నారని విమర్శించారు. తమ పార్టీకి, సిపిఎంకు ఓట్లేస్తే ఈ జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+