కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడపలో లోకేష్ టూర్-పోలీసుల హెచ్చరికలు-సెంట్రల్ జైల్ దగ్గర ఉత్కంఠ

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్న టీడీపీ నేతల్ని పోలీసులు అరెస్టులతో భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్న విపక్షం.. ఇందులో భాగంగా టార్గెట్ అవుతున్న నేతలకు అభయమిచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఇవాళ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు.

ఉదయం కడప చేరుకున్న నారా లోకేష్ కు టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. జిల్లాలోని ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోలీసులు తాజాగా అరెస్టుచేసి సెంట్రల్ జైలుకు పంపారు. దీంతో సెంట్రల్ జైల్లో ఆయన్ను పరామర్శించేందుకు లోకేష్ కడప వచ్చారు. పార్టీ నేతలతో కలిసి సెంట్రల్ జైలుకు ఆయన వెళ్లబోతున్నారు. అయితే లోకేష్ టూర్ లో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. లోకేష్ పర్యటనలో ఉద్రిక్తతలు తలెత్తితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.

nara lokesh kadapa tour amid police warnings-to visit proddutur tdp leader in jail

కడప చేరుకున్న నారా లోకేష్ జిల్లా ముఖ్య నేతలు, ఇంఛార్జులతో భేటీ అయ్యారు. జిల్లాలో తాజా రాజకీయ పరిణామాల పై చర్చించారు. అనంతరం విమానాశ్రయం నుండి కడప సెంట్రల్ జైలుకి బయలుదేరి వెళ్లారు.
కాసేపట్లో ప్రొద్దుటూరు టిడిపి ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ని లోకేష్ పరామర్శించనున్నారు. అనంతరం పార్టీ నేతలతో మరోసారి భేటీ కానున్నారు. దీంతో లోకేష్ టూర్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు పెంచారు.

English summary
tdp mlc nara lokesh on today reached kadapa to visit proddutur tdp incharge praveenkumar reddy in central prision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X