వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు చెప్పి .. ఏపీలో ఆ పరీక్షలు కూడా రద్దు చెయ్యాలన్న లోకేష్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటివరకూ పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేసి జగన్ సర్కార్ పై ఒత్తిడి తీసుకు వచ్చిన లోకేష్, మరో పరీక్షలు వాయిదా కోసం సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఏపీలో నిర్వహించవలసిన అన్ని పరీక్షలు వాయిదా వేయడం కానీ లేదా రద్దు చేయడం కానీ చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

మానవత్వం లేని ముఖ్యమంత్రీ .. అభినవ నీరో చక్రవర్తి , జగన్ వల్లే అన్యాయపు చావులు : లోకేష్ ధ్వజంమానవత్వం లేని ముఖ్యమంత్రీ .. అభినవ నీరో చక్రవర్తి , జగన్ వల్లే అన్యాయపు చావులు : లోకేష్ ధ్వజం

మే నెలలో జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షలు రద్దు చెయ్యాలన్న లోకేష్

మే నెలలో జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షలు రద్దు చెయ్యాలన్న లోకేష్

మూడు వారాల పాటు పదో తరగతి మరియు ఇంటర్ పరీక్షల రద్దు కోసం చేసిన ఆందోళన, న్యాయ పోరాటం తర్వాత ఇంటర్ పరీక్షలు వాయిదా వేసేందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు లోకేష్. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం మేనెలలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. మే నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రకాలైన ప్రవేశ పరీక్షలు జరగాల్సి ఉంది .కళాశాలలలో సెమిస్టర్ పరీక్షలు,ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాలని నారా లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు.

 రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై, పరీక్షల రద్దుకు సీఎం జగన్ కు లోకేష్ లేఖ

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై, పరీక్షల రద్దుకు సీఎం జగన్ కు లోకేష్ లేఖ

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు దారుణంగా మారాయని,ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణ లక్ష కూడా దాటటం లేదని పేర్కొన్నారు లోకేష్. ఇక ఆసుపత్రులలో సమస్యలు అలాగే ఉన్నాయని, బెడ్లు దొరక, ఆక్సిజన్ కొరతతో చాలామంది ప్రజలు చనిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని,ఈ విషయం తమకు తెలియనివి కావని లోకేష్ పేర్కొన్నారు. 2021 మేలో జరగాల్సిన ఆఫ్ లైన్ పరీక్షలను కేంద్రం ఇప్పటికే వాయిదా వేసిందని పేర్కొన్నారు .

మేలో జరగాల్సిన పరీక్షలు వాయిదా వెయ్యాలన్న లోకేష్ లేఖపై జగన్ స్పందిస్తారా ?

మేలో జరగాల్సిన పరీక్షలు వాయిదా వెయ్యాలన్న లోకేష్ లేఖపై జగన్ స్పందిస్తారా ?

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ మేరకు అన్ని కేంద్ర సంస్థలకు ఆదేశించిందని లోకేష్ పేర్కొన్నారు.దీనిని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్రంలో తాజా పరిస్థితి నేపథ్యంలో మే నెలలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలని లోకేష్ కోరారు. జూన్ మొదటి వారంలో పరిస్థితిని సమీక్షించి అప్పటి పరిస్థితికి తగినట్లుగా నిర్ణయం తీసుకోవాలని లోకేష్ సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే ఇంటర్, పది పరీక్షల విషయంలో టీడీపీ ఆందోళనలతో పరీక్షలు వాయిదా వేశారని టీడీపీ నాయకులు చెప్తున్నారు. మరి మరో పరీక్షల రద్దు లేదా వాయిదాకు లోకేష్ విజ్ఞప్తికి జగన్ సర్కార్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Recommended Video

Partial Curfew in AP Update: లాక్‌డౌన్ నిబంధనలు Borders లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు| Oneindia Telugu

English summary
Nara Lokesh thanked CM Jagan for postponing the inter-examinations after a legal battle over concerns over the cancellation of Class X and Inter-examinations for three weeks. In the same vein, the state government has appealed for postponement of all examinations scheduled for May. AP is scheduled to hold various entrance exams in May. Semester exams in colleges and competitive exams for government jobs are to be held. Nara Lokesh demanded CM Jaganmohan Reddy to postpone the tests in the wake of the ongoing corona epidemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X