5వేల ఓట్లతోనే! అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే: లోకేష్
అమరావతి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి రావడం అంత కష్టమేమీ కాదని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై 1500 రోజుల సందర్భంగా గురువారం ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ప్రారంభమైన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న లోకేష్ మాట్లాడారు.

లోపాలున్నాయి..
అనంతపురం, నంద్యాల, కడపలో బూత్ కమిటీల ఏర్పాటులో లోపాలున్నాయని త్వరలో తగు చర్యలు తీసుకుంటామని లోకేష్ చెప్పారు. 13 పార్లమెంట్ స్థానాల్లో శిక్షణా కేంద్రాలు ప్రారంభించామని మంత్రి వెల్లడించారు.

బూత్ కమిటీల బోపేతంతో..
సాధికారమిత్రల తరహాలో సేవా మిత్రలు వేస్తున్నామన్నారు. బూత్ కమిటీలకు, సేవామిత్రలకు శిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి బూత్ స్థాయిలో పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి నారా లోకేశ్ అన్నారు.

అన్ని స్థానాలు కైవసం..
బూత్ లెవల్ కమిటీలు బలమైతే వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలనూ కైవసం చేసుకోవడం సులభమవుతుందన్నారు. పార్టీ తరఫున ప్రతి వంద మందికి ఒకరు చొప్పున సేవా మిత్రను నియమిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.

5వేల ఓట్లతో గెలుపు..
ఐదు వేల ఓట్లతో గెలిచే అసెంబ్లీ సెగ్మెంట్లే ఎక్కువగా రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. ప్రతిబూత్ పరిధిలో అదనంగా 10 ఓట్లను ప్రభావితం చేయగలిగితే వచ్చే ఎన్నికల్లో గెలుపు సునాయాసమేనని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. కాగా, మంత్రి లోకేష్ ఇటీవల కాలంలో ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. విపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ..పవన్ కళ్యాణ్, వైయస్ జగన్మోహన్ రెడ్డిలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తమ ప్రభుత్వం వేసిన రోడ్లపైనే పవన్, జగన్‌లు తిరుగుతున్నారంటూ పలుమార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చంద్రబాబు అభివృద్ధి పుత్రుడైతే.. జగన్ అవినీతి పుత్రుడని, పవన్.. మోడీ దత్తపుత్రుడని తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications