వైయస్ లేఖ: వైయస్ విజయమ్మకు నారా లోకేష్ ప్రశ్న

కృష్ణా మిగులు జలాలు వద్దని వైయస్ రాజశేఖర రెడ్డి ఎందుకు లేఖ రాశారో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ రైతులకు చెప్పాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. రైతుల నుంచి పొలాలు లాక్కుని ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్‌లకు) కట్టబెట్టడం వారి పాలిట శాపం కాదా అని ఆయన ప్రశ్నించారు.
తొమ్మిది లక్షల రూపాయల స్థాయి నుండి హయ్యెస్ట్ పన్ను చెల్లింపుదారుగా కరప్షన్ కింగ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎదిగారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మంగళవారంనాడు ట్విట్టర్‌లో విమర్శించారు.
తొమ్మిదేళ్లలోనే జగన్ తొమ్మిది లక్షల పన్ను చెల్లింపు స్థాయి నుండి దేశంలోనే అత్యంత పన్ను చెల్లింపుదారుల్లో మూడో వ్యక్తిగా ఎదిగారని పేర్కొన్నారు. జగన్‌ను కరప్షన్ కింగ్ అంటూ... అతను తన విజయ రహస్యాన్ని బయటకు చెబితే దేశంలో పేదరికం చరిత్రగా మిగిలిపోతుందని సెటైర్ వేశారు.












Click it and Unblock the Notifications