జాబ్ క్యాలెండర్, డీఎస్సీపై తేల్చేసిన లోకేష్-అసెంబ్లీలో ప్రకటన..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. అయినా ఇప్పటివరకూ జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదని విపక్ష వైసీపీ ప్రశ్నిస్తోంది. అలాగే గతేడాది డీఎస్సీ సక్సెస్ తర్వాత మరో డీఎస్సీ ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే దాని విధివిధానాలు, నోటిఫికేషన్ పై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. ఈ రెండు అంశాలపై ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh).. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు జవాబుగా స్పందించారు.

ఉగాదికే జాబ్ క్యాలెండర్, డీఎస్సీ (Lokesh)

రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్, డీఎస్సీ నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదల చేస్తారన్న ప్రశ్నకు లోకేష్ సమాధానం ఇచ్చారు. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, అందులోనే డీఎస్సీ పోస్టులు కూడా ఉంటాయని లోకేష్ తేల్చిచెప్పేశారు. అంటే డీఎస్సీలో ఉండే పోస్టులతో కలిపే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని లోకేష్ ప్రకటించారు. తద్వారా ఈ ఉగాదికి టీచర్, ఇతర ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులందరికీ గుడ్ న్యూస్ ఉంటుందని లోకేష్ చెప్పినట్లయింది.

nara Lokesh reveals key details on job calendar and dsc notifications in assembly

కేజీబీవీ అడ్మిషన్లకు పోటీ

ఇప్పటికే రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు టెట్ పరీక్ష కూడా రాశారు. వీటి ఫలితాలు కూడా వెలువడ్డాయి. దీంతో వారంతా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. జాబ్ క్యాలెండర్ లో భాగంగా దీన్ని కూడా ఉగాదికి విడుదల చేస్తే వారంతా దరఖాస్తు చేసుకునేందుకు సిద్దమవుతున్నారు. మరోవైపు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలపై స్పందిస్తూ.. ఇతర రాష్ట్రాల్లో కేజీబీవీ అడ్మిషన్లు జరగడం లేదని, కానీ మన దగ్గర పోటీ ఉందని లోకేష్ తెలిపారు. అలాగే ఉన్నత విద్యలో ఇంజనీరింగ్ సహా పాలిటెక్నిక్, ఐటీఐ కూడా కీలకం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+