రావాలి కరెంట్ ..కావాలి కరెంట్ .. కొత్త నినాదం ఎత్తుకున్న నారా లోకేష్

Recommended Video

    AP లో పవర్ కట్ పై సెటైర్ వేసిన నారా లోకేష్! | Nara Lokesh Satire's On YS Jagan Over Power Cuts In AP

    ' రావాలి జగన్ కావాలి జగన్ ' ఇది ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నినాదం. ఏపీలో చాలా ప్రచారం పొందిన నినాదం ఇది. అయితే ఇప్పుడు ఆ నినాదాన్ని మార్చి చెబుతున్నారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. నారా లోకేష్ చెబుతున్న ఈ నినాదం కూడా చాలా ఆసక్తికరంగా ఉండటంతో ఇప్పుడు లోకేష్ చెబుతున్న నినాదంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇంటికి లోకేష్ ఏం చెప్పారంటే.

    అప్రకటిత విద్యుత్ కోతలపై భగ్గుమంటున్న టీడీపీ

    అప్రకటిత విద్యుత్ కోతలపై భగ్గుమంటున్న టీడీపీ

    'రావాలి జగన్ కావాలి జగన్' స్థానంలో లోకేష్ బాబు ఏపీలో ప్రస్తుత పరిస్థితులను బట్టి , విద్యుత్ కోతలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో 'రావాలి కరెంట్ కావాలి కరెంట్' అంటూ కొత్త నినాదం అందుకున్నారు. జగన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టి దాదాపు రెండు నెలలైంది. రాష్ట్రంలో పారదర్శకమైన పాలన అందించాలని, టిడిపి కంటే మెరుగైన పాలన అందిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ను రాష్ట్రంలో విద్యుత్ కోతలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఎలాంటి ప్రకటనలు లేకుండానే గంటలకు గంటల విద్యుత్ కోతలు చేస్తున్నారని టిడిపి నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అంతేకాదు మొన్నటికి మొన్నఅప్రకటిత విద్యుత్‌ కోతలపై శాసనసభలో టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. రాష్ట్రంలో ప్రతి రోజు 3 నుంచి 4 వరకు అప్రకటిత కరెంటు కోతలు విధిస్తున్న పరిస్థితుల్లో ప్రజల ఇబ్బందులను గురించి సభలో టీడీపీ వాయిదా తీర్మానం కూడా ఇచ్చింది.

    వైసీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే గంటలకొద్దీ కరెంట్ కోతలు అని విమర్శిస్తున్న టీడీపీ

    వైసీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే గంటలకొద్దీ కరెంట్ కోతలు అని విమర్శిస్తున్న టీడీపీ

    గతంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పవర్ కట్ లేకుండా చేశామని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక విద్యుత్ కోతలు పెరిగిపోయాయని అసెంబ్లీ వేదికగా చంద్రబాబు సైతం విమర్శించారు. ముందు విద్యుత్ కోతలపైన దృష్టి పెట్టమని, రాష్ట్రాన్ని అంధకారమయం కాకుండా చూడమని వైసిపికి హితవు పలికారు. ఇంతగా టీడీపీ నేతలు విద్యుత్ కోతలను టార్గెట్ చేసి మాట్లాడుతున్నా , సమస్యను పరిష్కరించడంలో మాత్రం వైసీపీ విఫలం అవుతోంది. ఇక ఈ సమస్యను హైలెట్ చేస్తూ టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ కొత్త నినాదం అందుకున్నారు.

    సోషల్ మీడియా వేదికగా ఆయన 'రావాలి కరెంట్ కావాలి కరెంట్' అని ట్వీట్ చేసారు.

    మీకు మీరే జబ్బలు చరుచుకుంటూ ఏదో ఘన కార్యం చేసినట్లు శభాష్ అనుకుంటే ఎలా అని ప్రశ్నించిన లోకేష్

    మీకు మీరే జబ్బలు చరుచుకుంటూ ఏదో ఘన కార్యం చేసినట్లు శభాష్ అనుకుంటే ఎలా అని ప్రశ్నించిన లోకేష్

    మేము అది చేస్తున్నాం ..ఇది చేస్తున్నాం అని గొప్పలు చెప్పుకోవడం ఆపి ముందు కరెంటు సమస్యను పరిష్కరించి రాష్ట్రం చీకటి మయం కాకుండా కాపాడాలని లోకేష్ అంటున్నారు. ముందు సీఎంను చీకటి నుండి బయటకు వచ్చి రాష్ట్రంలో విద్యుత్ సమస్యను త్వరగా పరిష్కరించాలని, ఆ తర్వాత తన పాలన పై ప్రశంసలు కురిపించు కోవచ్చని లోకేష్ ఎద్దేవా చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో మీకు మీరే జబ్బలు చరుచుకుంటూ ఏదో ఘన కార్యం చేసినట్లు శభాష్ అనుకుంటున్నారని, బయట చూస్తే ప్రజలంతా రావాలి కరెంట్ కావాలి కరెంట్ మీ ప్రభుత్వాన్ని, మీ పార్టీ గుర్తుని బతిమాలుకుంటున్నారు అని మీరు కాస్త చీకటి నుంచి బయటకు వచ్చి జనానికి కరెంట్ ఇవ్వండి అంటూ లోకేష్ సెటైర్ వేశారు.

    'ఇది కోతల ప్రభుత్వం ' అంటూ కరెంట్ కోతలపై ఎద్దేవా చేసిన టీడీపీ

    'ఇది కోతల ప్రభుత్వం ' అంటూ కరెంట్ కోతలపై ఎద్దేవా చేసిన టీడీపీ

    ఈ మేరకు ఒక వీడియోను కూడా లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇటు టీడీపీ సోషల్ మీడియా విభాగం కూడా కరెంటు కోతల పైన విమర్శలు మొదలు పెట్టింది.. కార్టూన్లతో సెటైర్లు పేల్చింది. ఇప్పుడు వరుణ యాగాలతో పాటూ కరెంట్ యాగాలు చేయాల్సి వస్తోంది.. తప్పదు కోతల ప్రభుత్వం కదా అంటూ ఎద్దేవా చేసింది. మొత్తానికి కరెంటు కోతలపై టిడిపి ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రం సీఎం జగన్మోహన్ రెడ్డికి గట్టిగా తాకుతుందా ... లేదా ప్రతిదాడికి వైసిపి సై అంటుందా తేలాల్సి ఉంది .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+