వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెడలు వంచుతారా.. కేసుల మాఫీ కోసం తల దించుతారా..?, వైసీపీ సపోర్టుపై నారా లోకేశ్

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు అంతా రాష్ట్రపతి ఎన్నికలపైనే చర్చ.. ఏ పార్టీ ఎవరికీ మద్దతు ఇస్తోంది. సపోర్ట్ చేసి డిమాండ్లను సాధించుకోవడం ఎలా అనే అంశాలపై జోరుగా చర్చ జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికలపై వైసీపీ కీలకంగా మారనుంది. ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల మద్దతు బీజేపీకి కంపల్సరీ అయ్యింది. సో డిమాండ్లు నెరవేర్చుకోవచ్చు కదా అని ప్రశ్న వస్తోంది. ఇదే అంశంపై సీఎం జగన్‌కు పలువురు సూచనలు చేస్తున్నారు.

వైసీపీ మద్దతు కంపల్సరీ..

వైసీపీ మద్దతు కంపల్సరీ..


రాష్ట్రపతి ఎన్నికల గురించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఎన్డీయే అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి అవుతుంది. మరీ స్పెషల్ స్టేటస్ సాధిస్తారని ప్రజలు 22 మంది ఎంపీలను ఇచ్చారని తెలిపారు. మరీ సీఎం జగన్ ఏం చేస్తారో అనే చర్చ జరుగుతుంది.
ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా కోసం మీరు పోరాడిందే నిజమైతే.. ప్రత్యేక హోదా ప్రకటిస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని ప్రకటన చేయగలరా?" అని లోకేశ్ సవాల్ విసిరారు.

ఏం చేస్తారో జగన్ రెడ్డి..

ఏం చేస్తారో జగన్ రెడ్డి..


మెడలు వంచుతారా? లేక కేసుల మాఫీ కోసం తల దించుతారా జగన్ రెడ్డి గారూ? అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజల కోసం పాటుపడరా అని అడిగారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు బీజేపీకి తప్పనిసరి.. మిగతా ఏ పక్షం కూడా సపోర్ట్ చేసే పరిస్థితులో లేదు. సో ఉన్న మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని విపక్ష నేతలు కోరుతున్నారు. వారిలో నారా లోకేశ్ కూడా చేరారు.

బరిలో ఉండెదెవరో

బరిలో ఉండెదెవరో


రాష్ట్రప‌తి ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్‌ను ఈ నెల 15వ తేదీన జారీ చేశారు. ఆ రోజు నుంచే నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్రారంభ‌ం అయ్యింది. ఈ నెల 29 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తారు. 30న నామినేష‌న్ల ప‌రిశీలన ఉంటుంది. జులై 2 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉండనుంది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో కీల‌కమైన పోలింగ్‌ను జులై 18న నిర్వ‌హిస్తామని.. జులై 21న ఓట్ల లెక్కించనున్నారు.

English summary
tdp leader nara lokesh satires on ycp support bjp for president elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X